Gutta Sukender Reddy
-
శాసన మండలి చైర్మన్ గుత్తా ఉక్కిరి బిక్కిరి.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు దగ్గరి అనుచరులుగా ఉన్న వారంతా బీఆర్ఎస్ను వీడుతున్నారు. వారంతా కట్టకట్టుకు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. దీంతో పరోక్షంగా ఈ ప్రభావం మండలి చైర్మన్‌కు ఎఫెక్ట్ అయ్యేలా ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితులు తలెత్తాయంటున్నారు. తెలుగుదేశం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన మదర్ డెయిరీ చైర్మన్‌గా, ఎంపీగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. అదే సమయంలో సుఖేందర్ రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్న నాటి సీపీఐ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సైతం సీపీఐ నుంచి బీఆర్ఎస్లోకి మారిపోవడంతో గుత్తా కీలకంగా వ్యవహరించారు. మరో వైపు టీడీపీలో ఉన్న సమయం నుంచీ ఇప్పటి నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులతో గుత్తాకు బయటకు కనిపంచేంత సఖ్యత లేదు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి గులాబీ కండువా కప్పుకున్న ఆయనకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు, తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా కూడా అవకాశం కల్పించారు. పదవీ కాలం ముగిశాక కూడా రెండోసారి ఎమ్మెల్సీగా, మరో మారు మండలి చైర్మన్ గా పదవిలో కూర్చోబెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న, తన రాజకీయ వారసునిగా తన తనయుడు అమిత్‌ను అరంగేట్రం చేయించే పనిలో ఉన్నారు. కానీ, తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్బంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. వారితో చెడిందా? ఎవరితో తనకు విభేదాలు లేవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ లతో ఈ మధ్య చెడిందన్న వార్తలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖరారు చేసిన నాటినుంచే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారిలో దేవరకొండ ఒకటి. అక్కడి అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్న వారంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరి అనుచరులు కావడం గమనార్హం. టీడీపీ తరపున దేవరకొండ జెడ్పీటీసీ సభ్యునిగా పని చేసిన కాలం నుంచి గుత్తా ఏ పార్టీలోకి వెళితే ఆయన వెంట ఆయా పార్టీల్లోకి వెళ్లి వెంట నడుస్తున్న వారే కావడం గమనార్హం. ఇపుడు వీరంతా.. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహులు, మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా కట్టకట్టుకుని మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల మాటను బేఖాతరు చేసి, సుఖేందర్ రెడ్డి మాటలను చెవిన పెట్టకుండా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలూ నాయక్ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పదుల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, తిప్పర్తి జెడ్పటీసీ సభ్యుడు వీరంతా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అత్యంత దగ్గరి అనుచరులు కావడం విశేషం. జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి పార్టీ మారడం గుత్తా సుఖేందర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. దీంతో ఆయన తాను పార్టీ మారడం లేదని, తన అనుచరులను బయటకు పంపడం లేదని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే తాను కానీ, తన తనయుడు కానీ, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. సుఖేందర్ రెడ్డి అనుచరగణం పార్టీ వీడుతుండడాన్ని ఆయా నియోజకవర్గాల సిట్టింగు అభ్యర్థులు హై కమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో మండలి చైర్మన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చదవండి: కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి? -
జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగించే పరిస్థితి లేదు. డిసెంబర్‌లోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జమిలీ ఎన్నికల పేరుతో ప్రజలను గందరగోళంలో పడేశారు. అన్ని మార్గాలను ఉపయోగించి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. జమిలీ ఎన్నికలు సాధ్యం కాకపోతే మినీ జమిలీ నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలను గందరగోళపరిచి గట్టెక్కాలని బీజేపీ చూస్తోందన్నారు. అలాగే, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహులు ఉన్నారని కొందరు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలకు స్వప్రయోజనాలే ముఖ్యం. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి.. వీరి ముగ్గురివి మూడు దారులు. కోమటిరెడ్డి సగం శరీరం బీజేపీలోనే ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే. -
మంత్రి జగదీష్‌తో ఎలాంటి విభేదాలు లేదు: గుత్తా కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంందనే ప్రచారం సాగుతోంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంతో సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై కూడా వ్యాఖ్యలు చేశారు. కాగా, గుత్తా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు, మంత్రి జగదీష్‌కి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. అలాగే, ఉద్యోగుల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల్లో నేను జోక్యం చేసుకోలేదన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. తన కుమారుడు అమిత్‌కు టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తారు. టికెట్ కోసం పైరవీలు చేయనని చెప్పారు. వామపక్షాలతో సీట్లు పొత్తు ఖరారు అయ్యాకనే ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మార్పు క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. వామపక్షాలు బీఆర్ఎస్తో పొత్తుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఎక్కడ పని చేసినా రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలన్నారు. కాగా, సొంత పార్టీ ఎంపీపీ, మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం సరికాదు. అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సీరియస్ అయ్యారు. వెంకట్ రెడ్డి నోటికి అడ్డు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. తాను భాష ప్రయోగం విషయంలో హుందాగా ఉంటుందని తెలిపారు. బురదలో రాయి వేసే అలవాటు తనకు లేదన్నారు. తమ పనిని ప్రజలు మెచ్చుతున్నారా.. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించాలని హితవు పలికారు. ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు! -
గుత్తా, జగదీష్ రెడ్డి కుటుంబ ఆస్తులపై భట్టి సంచలన ఆరోపణలు!
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే వారిద్దరూ నా పంచ గురించి మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డికి భటి కౌంటర్ ఇచ్చారు. వీరి ఆస్తులు వేల కోట్లకు ఎలా చేరుకున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, కనగల్లులో భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భవిష్యత్తే లేకుండా పోయింది. ధరణి పేరుతో భూమి గుంజుకుంటున్నారు. గిరిజన పోడు భూములను లాక్కుంటున్నారు. ఉద్యోగాలు వస్తామని ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడా ఇల్లు లేదు.. వాకిలి లేదు. ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వడం లేదు. ఉపాధి పనులు చేసుకునేవాళ్లకు కూలీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో నేడు భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లాలోని దాదాపు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించారు. సొరంగం తవ్వేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకువచ్చాం. టన్నెల్‌కు సంబంధించిన దాదాపు 32 కిలోమీటర్ల పనులను పూర్తి చేశాం. రాష్ట్రం వచ్చి పదేళ్లువుతోంది.. ఇన్నేళ్లలో పట్టుమని రెండు మూడు కిలోమటర్లు కూడా తవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడమంటే నా పంచ గురించి, నా గోశి గురించి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎక్కడా మార్పు రాలేదు. బీఆర్ఎస్ నాయకుల జీవితాల్లో మాత్రం అద్భుతమైన మార్పు వచ్చింది. సీఎం కేసీఆర్, జగదీష్ రెడ్డి కుటుంబం, గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ ఆస్తులు వేల కోట్లు పెరిగాయి. వీరిద్దరి లాంటి వాళ్లతో నల్లగొండ జిల్లా ప్రజలకు ఏలాంటి ప్రయోజనం ఉండదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. కార్యకర్తల నారాజ్! -
కేసీఆర్ సర్కార్ Vs గవర్నర్.. మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రిపబ్లిక్ డే సందర్బంగా చోటుచేసుకున్న మాటల యుద్ధం తాజాగా మరో స్థాయికి చేరుకుంది. కాగా, రాష్ట్ర బడ్జెట్ 2023–24 ప్రతిపాదనలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోద్ర ముద్ర వేయలేదు. దీంతో, ఈ విషయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ వ్యవస్థ, లౌకిక విధానం కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయి. వక్రబుద్దితో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలి. శాసన సభ, శాసన మండలి, గవర్నర్ ఎవరైనా సరే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునుఏ ధోరణిలో ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్ సిఫారసుల కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాజ్‌భవన్‌లోనే ఉండిపోయాయి. -
TS: రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా గుత్తా!
హైదరాబాద్: టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆదివారం గుత్తా నామినేషన్ దాఖలు చేశారు. సుఖేందర్‌రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్ సెట్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా సంతకాలు చేసినట్లు సమాచారం. దీంతో మండలి నూతన చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే అయ్యింది. గుత్తా నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఏం ఎస్ ప్రభాకర్ రావు,విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు భాను ప్రసాద రావు,దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు కృతజ్ఞతలు రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు గుత్తా కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఏకగ్రీవానికి అన్ని పార్టీల సభ్యులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు గుత్తా. గతంలో మాదిరిగానే సభను హుందాతనంగా నడిపించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని గుత్తా తెలిపారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థి: వాహనం, అభరణాలు..గుంట భూమీ లేదు.. కానీ భార్య పేరిట..
సాక్షి, నల్లగొండ: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరిట వాహనాలు ఏమీ లేవు. గుంట భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. స్థిర, చరాస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరునే ఉన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో తన, తన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. గోపాలపురం పోలీసు స్టేషన్లో కేసు ఉన్నట్లు తెలిపారు. అలాగే కోర్టుల్లోనూ కేసులు ఉన్నట్లు వివరించారు. తన చేతిలో రూ. 1.5 లక్షలు, తన భార్య వద్ద రూ. 1.08 లక్షలు, అవిభక్త కుటుంబం వద్ద రూ.2,97,026 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరిట రూ. 83 లక్షలకు పైగా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉండగా, భార్య అరుంధతి పేరిట రూ.1.01 కోట్లు, అవిభక్త కుటుంబం పేరుతో రూ.1.72 కోట్లకుపైగా డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నట్లు వెల్లడించారు. వైడ్ బిజినెస్ సొల్యూషన్స్ పేరుతో రూ.6.4 లక్షలు, హిందూ అవిభక్త కుటుంబం పేరుతో కొత్త పేటలో మహాలక్ష్మి థియేటర్ (ప్రస్తుత విలువ రూ.2.5 కోట్లు), అమిత్ఎంటర్ ప్రైజెస్(రూ.70 లక్షలు) ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున గానీ, తన భార్య పేరున గానీ ఎలాంటి వాహనాలూ లేవని తెలిపారు. తనకు ఆభరణాలు లేవని తెలిపారు. భార్య పేరిట రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2.5 లక్షల విలువైన 4 కిలోల వెండి, హిందూ అవిభక్త కుటుంబం పేరిట రూ.8.75 లక్షల విలువైన 175 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు సుఖేందర్‌రెడ్డి వివరించారు. భార్య పేరిట చిట్యాల, కేశంపల్లిలో 7.48 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిలీంనగర్‌లో 2389.5 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కలుపుకొని వాణిజ్య భవనం, చిట్యాలలో 3888 చదరపు అడుగుల వాణిజ్య భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. పుప్పాలగూడలో 473 చదరపు అడుగుల నివాస భవనం, చిట్యాలలో 3,600 చదరపు అడుగుల నివాస భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా వాటి విలువ రూ.5,89,13,480గా పేర్కొన్నారు. ఆయనకు చెందిన హిందూ అవిభక్త కుటుంబం పేరుతో ఊరుమడ్ల, దేవరకొండలో 39.72 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు వెల్లడించారు. ఊరుమడ్ల గ్రామకంఠంలో నాలుగు గుంటలు, మామిళ్లగూడ, నందిపహడ్లో 1012 చదరపు గజాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తన పేరిట రూ.36,57,500, భార్య పేరిట రూ.1,20,04,000, హిందూ అవిభక్త కుటుంబం పేరుతో రూ.1,32,07,566 లోన్లు తీసుకున్నట్లు తెలిపారు. · భార్య పేరిటనే స్థిరాస్తులు · ఎమ్మెల్సీ నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న సుఖేందర్‌రెడ్డి -
ఆశావహుల్లో ఉత్కంఠ.. గుత్తా, కడియంలకు మళ్లీ చాన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో స్థానం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల మొదటి వారంలో పూర్తయ్యింది. అలాగే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా ఈ నెల 17న పూర్తయ్యింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు గత నెల మూడో వారంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నిక తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారు మాత్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. గుత్తా, కడియం ముందు వరుసలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆరుగురిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఇదే కోటాలో తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డికి మళ్లీ అవకాశం కల్పించి మరోసారి మండలి చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని లేదా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కడియం శ్రీహరికి కూడా ఎమ్మెల్సీగా తిరిగి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం వరంగల్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కడియం ఇంట్లో భోజనం చేశారు. మరోవైపు రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం స్తబ్దుగా ఉన్న కడియం ఇటీవలి కాలంలో తరచూ సీఎంను కలుస్తున్నారు. కడియంకు తిరిగి ప్రాధాన్యత దక్కుతుందనడానికి ఇవి సంకేతాలుగా చెబుతున్నారు. భారీగానే జాబితా మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల జాబితా భారీగానే ఉంది. పద్మశాలి, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజికవర్గ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, తక్కల్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పీఎల్ శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి, శుభప్రద పటేల్ వంటి వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరే పక్షంలో ఆయనకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని సమాచారం. గవర్నర్ కోటాలో సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపైనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. చదవండి: ప్రజాసేవకు పదవులు అవసరం లేదు: కడియం శ్రీహరి Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్ఎస్, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్ ఎందుకిలా! -
గతంలో ‘పోతిరెడ్డిపాడు’పై మాట్లాడలేదే?
సాక్షి, హైదరాబాద్: గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఒక్క మాట మాట్లాడని కాంగ్రెస్ నేతలు కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం సిగ్గుచేటని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడే తాను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వ్యతిరేకించిన విషయాన్ని మండలి చైర్మన్ గుర్తు చేశారు. తెలంగాణ శాసన మండలి కమిటీ హాల్లో శనివారం గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు పరిష్కారం కాకముందే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో పులిచింతలపై సర్వే చేయించిన ఇద్దరు ఎంపీలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నారని, కాంట్రాక్టులు తీసుకున్న కొందరు నేతలు ఆంధ్రా నేతలకు వత్తాసు పలికారని గుత్తా విమర్శించారు. పోతిరెడ్డిపాడు అంశంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ.. ఏపీ, తెలంగాణలో వేర్వేరు వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఉపవాస దీక్షలతో ఒరిగేదేమీ లేదు 1969 నాటి తెలంగాణ ఉద్యమం మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా నీళ్లు, నిధుల కోసమే జరిగిందని, రెండు గంటల ఉపవాస దీక్షలతో ఒరిగేదేమీ లేదని గుత్తా విమర్శించారు. 203 జీవోను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు రాజకీయాలను వదిలి పోతిరెడ్డిపాడు పనులను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని గుత్తా సూచించారు. ఉమ్మడి రాష్ట్రానికి ఏపీ, రాయలసీమ వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉండటం వలనే తెలంగాణకు నష్టం కలిగిందని ఆరోపించారు. -
రూ. 25 లక్షల విరాళం అందజేసిన గుత్తా అమిత్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్ : కరోనాపై పోరుకు ప్రతిఒక్కరు తమ వంతు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా భాదితులకు చికిత్స అందించడానికి, ప్రజలకు సకల వసతులు కల్పించడానికి తమ వంతు సాయంగా శాసన మండలి చైర్మైన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌కుమార్‌రెడ్డి ముందకు వచ్చారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన అమిత్‌కుమార్‌రెడ్డి, వీఏఆర్‌కేఎస్ ఎండీ నిమ్మ సుదర్శన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి సహాయనిధికి వీఏఆర్‌కేఎస్ కంపెనీ తరఫున రూ. 25 లక్షల విరాళం అందించారు. కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని అమిత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా నిలుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, అధికారులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
'విభజన రాత్రిళ్లు జరిగిందనడం హాస్యాస్పదం'
సాక్షి, నల్గొండ : డీసీసీబీ సహకార బ్యాంకులకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తుందన్నారు. రాష్ట్ర విభజన రాత్రిళ్లు చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ జమ్మూకశ్మీర్‌కే వర్తింస్తుందనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి అనేది మంచి కార్యక్రమం అని, ఇలాంటి వాటికి రాజకీయాలు జోడించాల్సిన అవసరం లేదన్నారు. -
మోసాలకు.. కుట్రలకు కేరాఫ్ అడ్రాస్ చంద్రబాబు
-
‘గుత్తా ఆధారాలు సేకరించి.. అమ్ముడుపోయారు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆ పార్టీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని పార్టీలు తిరిగిన గుత్తాకు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే స్థాయి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉండి మిషన్ భగీరథలో జరుగుతున్న అవినీతిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలు సేకరించి.. ఆ తర్వాత డబ్బులకు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గుత్తా మాదిరి మూడు పార్టీలు మారలేదని తెలిపారు. గుత్తా రాజకీయాలకు పనికిరాడని.. ముఖ్యమంత్రి వద్ద చెంచాగిరి చేసుకోవడానికే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే కాంగ్రెస్ సీనియర్లపై గుత్తా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
విప్ గండం నుంచి గట్టెక్కిన ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం తమతమ పార్టీలు జారీచేసిన విప్ గండం నుంచి ముగ్గురు తెలంగాణ ఎంపీలు గట్టెక్కగలిగారు. లోక్‌సభలో జీఎస్టీ బిల్లుకు సంబంధించి ఓటింగ్ కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అందులో భాగంగానే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ నుంచి మల్లారెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇటీవల టీఆర్ఎస్లో చేరిన సంగతి విదితమే. సాంకేతికంగా ఆ ముగ్గురు ఎంపీలు తాము ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందిన సభ్యులుగానే లోక్‌సభలో కొనసాగుతున్నారు. అయితే ఏఐడీఎంకే మినహా అన్ని రాజకీయ పార్టీలు జీఎస్టీ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో గుత్తా, మల్లారెడ్డి, పొంగులేటిలు విప్ గండం నుంచి తప్పించుకోగలిగారు. కాగా తాను రెండు, మూడు నెలల్లో లోక్‌సభకు రాజీనామా చేస్తానని గుత్తా పార్లమెంట్లో సహచర ఎంపీలకు తెలిపారు. -
సూర్యాపేట ఎఫ్ఎం స్టేషన్ నిర్మాణం పూర్తిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ/ సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వినతికి స్పందిస్తూ స్టేషన్ పనులను మంత్రి వెంకయ్య సమీక్షించారు. ట్రాన్స్‌మీటర్ భవనం ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటుకు 2007లోనే కేంద్రం ఆమోదం తెలిపినప్పటికీ పనుల్లో పురోగతి లేదు. గుత్తా వినతికి స్పందన..: సూర్యపేట ఎఫ్ఎం స్టేషన్ పూర్తయ్యేందుకు సమయం ఆసన్నమైంది. బుధవారం దీనిపై పార్లమెంటులో నల్ల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి వెంకయ్య నాయుడుకు వినతిపత్రం సమర్పించడంతో ఆయన సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడారు. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఈ ఎఫ్ఎం రేడియో స్టేషన్‌ను మంజూరు చేశారు. నిర్మాణ పనులు కొంత పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావులు వెంకయ్య నాయుడును కోరినట్లు తెలిసింది. -
'జానారెడ్డివి కోవర్టు రాజకీయాలు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే పార్టీకి నష్టమని అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి సోదరులు టీఆర్ఎస్లోకి వెళ్లడానికి ఐదు సార్లు ముహుర్తాలు పెట్టుకున్నారని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి కాంట్రాక్టులను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు అండంతో సంపాదించారని ఆరోపించారు. వీరంతా ఎంత తొందరగా కాంగ్రెస్ పార్టీని వీడితే అంత మంచిదని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు కూడా టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నాని ఎంపీ పాల్వాయి తెలిపారు. -
'టీఆర్ఎస్లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త మంత్రిత్వ శాఖ'
నల్గొండ : అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆ శాఖ బాధ్యతలు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి నిర్వహిస్తున్నారని తెలిపారు. శుక్రవారం నల్గొండలో సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్‌పై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చేశామని చెబుతున్న టీఆర్ఎస్... ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలను కలుపుకుని పోతామని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా
-
అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా
నల్గొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నల్గొండలో స్పందించారు. అవినీతి, అధికార దుర్వినియోగంతోనే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని ఆయన ఆరోపించారు.టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గుత్తా ఈ సందర్భంగా అన్నారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామన్నారు. అలాగే అవసరమైతే టీడీపీతో కూడా తమ పార్టీ పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ దాదాపు మూడు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోవ స్థానంలో ఉండగా.... , బీజేపీ - టీడీపీ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డిపై విధంగా స్పందించారు. -
'కేసీఆర్ ఎందుకు మాట తప్పారో చెప్పాలి'
నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు. మాట తప్పితే తల నరుక్కుంటానని చెబుతున్న కేసీఆర్... దళిత సీఎం, మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మాట తప్పారో చెప్పాలని గుత్తా డిమాండ్ చేశారు. -
'టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది'
వరంగల్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నేతలు ఎన్నిక నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయకుండా కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. 'టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ గెలుపు మాదే, ఎన్నిక ఏకపక్షం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రచారం చేయడమెందుకు' అని గుత్తా ప్రశ్నించారు. -
లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా చేయండి!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. శనివారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్‌రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే.. మాత్రం 17 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
'ఎమ్మెస్సార్ వృద్ధాప్యంలో ఉన్నారు'
హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో స్పందించారు. ఎమ్మెస్సార్ వ్యాఖ్యలను గుత్తా సుఖేందర్‌రెడ్డి తప్పపట్టారు. ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకున్నారని గుర్తు చేశారు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నారని చెప్పారు. అందువల్ల కేసీఆర్ పాలనపై ఆయనకు అవగాహన లేదన్నారు. ఈ వయస్సులో ఎమ్మెస్సార్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని గుత్తా అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందని మాజీ పీసీసీ చీఫ్ ఎమ్మెస్సార్ శుక్రవారం హైదరాబాద్ లో ప్రశంసించారు. కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు ఆరోపించినట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ పై విధంగా స్పందించారు. -
'ఎదురుదాడి ప్రయత్నాలు మానుకోండి'
నల్లగొండ: ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాల గురించి గళమెత్తుతానే తప్పా... అభివృద్ధి పనులకు అడ్డుచెప్పే వ్యక్తిని కాదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తాను అడ్డుపడుతున్నట్లు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని గుత్తా తిప్పికొట్టారు. అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవకతవకలు సరిదిద్దకుండా తనపై ఎదురుదాడికి దిగడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని హితబోధ చేశారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ అండ్ బి అధికారులు రహదారుల పనులకు సంబంధించి టెండర్లు పిలిచిన పనులు టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం అభివృద్ధిని నిరోధించడమవుతుందని అన్నారు. నాన్‌సీఆర్‌ఎఫ్ కింద మంజూరైన నిధులతో దేవరకొండ ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో బోర్లు వేయించుకోవడాన్ని అవినీతి చర్యగా పేర్కొన్నారు. ఎంపీ నిధులతో చేపట్టిన రహాదారుల పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తే తానే స్వయంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్తో విచారణకు ఆదేశించిన నైజం తనదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పు డే సూర్యాపేట నియోజకవర్గంలో రూ.35 కోట్లతో రోడ్లు నిర్మించానని, 2015-16లో మంజూరు కావాల్సిన 400 కేవీ సబ్‌స్టేషన్‌ను 2013-14లో మంజూరయ్యే విధంగా యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించానని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం వరకే తన బాధ్యతని అన్నారు. -
'అది ట్యాపింగ్ కాదు.. వాయిస్ మాత్రం బాబుదే'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడిన ఆడియో టేపులు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేసినవి కావని, అయితే స్టీఫెన్ సన్తో ఉన్న ఫోన్ సంభాషణలోని వాయిస్ మాత్రం చంద్రబాబునాయుడిదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇంకా మరిన్ని తప్పులు చేయోద్దని సూచించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, కేసీఆర్ ఫిరాయింపులతో అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ ఆదిపత్యం కోసం రెండు రాష్ట్రాల మధ్య అగాధం సృష్టిస్తున్నారని చెప్పారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని అన్నారు. కేసీఆర్ వాటిని త్వరగా పూర్తి చేయాలని, వాటికి ఏపీ మంత్రులు అడ్డుపడాలని చూడటం సరికాదని అన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో రూపొందినవేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై తుదిదశకు చేరిన ప్రాజెక్టులను కేసీఆర్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. -
'కేసీఆర్, చంద్రబాబు ముఠా నేతల్లా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ... ఇద్దరు సీఎంలు గ్యాంగ్‌వార్ మాదిరిగా... ముఠా నేతలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత కక్షలు తీర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారం వివాదం రెండు రాష్ట్రాల మధ్య హోరుగా మార్చేశారన్నారు. అధికారం చేతిలో ఉందికదా అని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
'రెండు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయి'
మిర్యాలగూడ(నల్లగొండ) : తెలుగు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలసి విలేకరుతో మాట్లాడారు. ముఖ్యమంత్రులిద్దరూ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలను ప్రోత్సహించి టీఆర్ఎస్లో చేర్చుకున్నారన్నారు. అదే విధంగా ఏపీలో చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని టీడీపీలో చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాతినిధ్యం కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తే అనైతిక రాజకీయాలు, అప్రజాస్వామిక పాలన బట్టబయలైందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని పేర్కొన్నారు. -
'మా తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి'
నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో తమ తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలయ్యామని కరీంనగర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... నల్గొండ జిల్లా ప్రజలు విజ్ఞత ప్రదర్శించి గుత్తా సుఖేందర్ రెడ్డిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. సోనియా లేకుంటే తెలంగాణ కల సాకారం అయ్యేది కాదని పొన్నం అన్నారు. అయితే కొంతమంది అమర వీరుల త్యాగబలం, 14 ఏళ్ల కేసీఆర్ ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందనటం సరికాదన్నారు. ఇవన్నీ అందులో భాగమేనని పొన్నం వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగిందన్నారు. ఇక పోలవరం ఆర్డినెన్స్ విషయంలో టీఆర్ఎస్ తీసుకొనే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్నారు. -
'బాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం'
తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తే ఊరుకోమని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును హెచ్చరించారు. నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... తమతో పొత్తుపెట్టుకున్న బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా అని తెలంగాణ రాష్టంపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం తొందరపడకూడదని ఆయన మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీఎంలతో చర్చించి పోలవరం సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. మోడీ కేబినెట్లో తెలంగాణకు చోటు దక్కకపోవడం బాధాకరమన్నారు. -
తెలంగాణను మోసం చేసింది 'ఆ ఇద్దరే'
తెలంగాణను మోసం చేసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్లే అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి జి.వివేక్‌లు ఆరోపించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యమద్రోహులకు కేసీఆర్ టిక్కెట్లిచ్చారని వారు విమర్శించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను పార్టీలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌లు కాంగ్రెస్ అధిష్టానానికి మాట ఇచ్చారని గుత్తా, వివేక్‌లు గుర్తు చేశారు. ఇచ్చిన మాటను టీఆర్ఎస్ విస్మరించిందని అన్నారు. కానీ తెలంగాణ ఇస్తామన్న మాటకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంస్థను సరిగ్గా నడపలేని కేసీఆర్.... తెలంగాణను ఎలా పునర్నిర్మిస్తాంటూ వివేక్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. గుజరాత్ లోని గోద్రా అల్లర్లకు ముఖ్య కారకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ అని గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారని వారు గుర్తు చేశారు. అలాంటి బాబు ప్రస్తుతం మతోన్మాద శక్తులకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు`
నల్గొండ: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ఎంపీలపై చర్యలు తీసుకోవాడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసే వారంతా సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారని సుఖేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో రేపు రాష్ట్రపతిని కలుస్తామని ఎంపీ గుత్తా సుఖేందర్ తెలిపారు. -
‘బలవంతపు సంసారాన్ని ఏమంటారో.. మీ భార్యలనడగండి’
సీమాంధ్ర ఎంపీలపై టీ-ఎంపీలు పొన్నం, గుత్తా ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘సంసారమైనా, వ్యాపారమైనా బలవంతంగా చేయండంటే.. దాన్ని ఏమంటారో మీ భార్యల్నే అడిగి చెప్పండి’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సీమాంధ్ర ఎంపీలపై ధ్వజమెత్తారు. వారు గురువారమిక్కడ ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేశాక సైతం దానిని అడ్డుకుంటామని, విభజన జరగదని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. పార్టీ నిర్ణయంపై గౌరవం లేకుండా, ధిక్కార ధోరణితో వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం లోక్‌సభలో సైతం ఉండవల్లి ప్రసంగాన్ని తాము అడ్డుకోలేదని, వాస్తవాలు చెప్పమని మాత్రమే అడిగామని అన్నారు. దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టుగా సీమాం ధ్ర ఎంపీలు వ్యవహరిస్తున్నారని, వారి దొంగ నాటకాలను ఇకనైనా కట్టిపెట్టాలని సూచించారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం ద్వారా సీఎం విద్వేషాలను మరింత పెంచుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘా తం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న వారంతా విభజనను సమర్థించాలని వారు సూచించారు.