
హైదరాబాద్ : కరోనాపై పోరుకు ప్రతిఒక్కరు తమ వంతు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా భాదితులకు చికిత్స అందించడానికి, ప్రజలకు సకల వసతులు కల్పించడానికి తమ వంతు సాయంగా శాసన మండలి చైర్మైన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌కుమార్‌రెడ్డి ముందకు వచ్చారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన అమిత్‌కుమార్‌రెడ్డి, వీఏఆర్‌కేఎస్ ఎండీ నిమ్మ సుదర్శన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి సహాయనిధికి వీఏఆర్‌కేఎస్ కంపెనీ తరఫున రూ. 25 లక్షల విరాళం అందించారు. కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని అమిత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా నిలుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, అధికారులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment