హైదరాబాద్: టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆదివారం గుత్తా నామినేషన్ దాఖలు చేశారు. సుఖేందర్‌రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్ సెట్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా సంతకాలు చేసినట్లు సమాచారం. దీంతో మండలి నూతన చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే అయ్యింది.
గుత్తా నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఏం ఎస్ ప్రభాకర్ రావు,విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు భాను ప్రసాద రావు,దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు కృతజ్ఞతలు
రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు గుత్తా కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఏకగ్రీవానికి అన్ని పార్టీల సభ్యులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు గుత్తా. గతంలో మాదిరిగానే సభను హుందాతనంగా నడిపించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని గుత్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment