సాక్షి,సిద్దిపేట: కేసీఆర్ ఆదేశాలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీల అందరి నెల జీతం వరద బాధితులకు ఇస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్‌ల నెల జీతం కూడా ఇస్తామని చెప్పారు.
‘ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలి. సిద్దిపేట మున్సిపల్ కమిషర్ రూ.11 వేల విరాళం ఇచ్చారు. రేపు సిద్దిపేట నుంచి వెళ్లే సరుకులను ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తాం. 6 లారీల్లో ఖమ్మంకు సరుకులను పంపుతున్నాం. రాష్ట్రంలో వరదలు వచ్చాయి. నేను ఖమ్మం వెళ్ళాను. వరద బాధితులు 24 గంటలు నీటిలో ఉన్నారు. వాళ్ళను చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.
వాళ్లకు ఏమి లేవు. అన్నీ కొట్టుకుపోయాయి. వాళ్లకు మన సిద్దిపేట నుంచి 500 గ్రాసరి కిట్లు పంపించడానికి అమర్ నాథ్ సేవా సమితి ముందుకు వచ్చింది. అమర్‌నాథ్ సేవా సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సిద్దిపేట నిలయం. చెరువులను కాపాడం మన అందరి బాధ్యత. ఆకర్షణ కన్నా ఆధ్యాత్మికత ముఖ్యం..మట్టి వినాయకులను పూజిద్దాం’అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment