
సాక్షి, నల్గొండ : డీసీసీబీ సహకార బ్యాంకులకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తుందన్నారు. రాష్ట్ర విభజన రాత్రిళ్లు చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ జమ్మూకశ్మీర్‌కే వర్తింస్తుందనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి అనేది మంచి కార్యక్రమం అని, ఇలాంటి వాటికి రాజకీయాలు జోడించాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment