!['బాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం'](/styles/webp/s3/article_images/2017/09/2/51376022243_625x300_7.jpg.webp?itok=mivA4rYm)
'బాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం'
తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తే ఊరుకోమని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును హెచ్చరించారు. నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... తమతో పొత్తుపెట్టుకున్న బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా అని తెలంగాణ రాష్టంపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు.
పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం తొందరపడకూడదని ఆయన మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీఎంలతో చర్చించి పోలవరం సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. మోడీ కేబినెట్లో తెలంగాణకు చోటు దక్కకపోవడం బాధాకరమన్నారు.