Nalgonda MP
-
ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
నల్లగొండ: తనను గెలిపిస్తే ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కార మార్గం చూపుతానని బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి హాలియా పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మాజీ మంత్రి జానారెడ్డి చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో పేదలకు సరైన వైద్యం అందక హైదరాబాద్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంకణాల నివేదితారెడ్డి, హాలియా మున్సిపాలిటీ ఇన్చార్జి మన్నెం రంజిత్‌యాదవ్, చెన్ను వెంకటనారాయణరెడ్డి, డాక్టర్ పానుగోతు రవికుమార్, చలమల్ల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.దాచుకోవడం, దోచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యంపెద్దవూర: అధికారంలోకి వస్తే దాచుకోవడం, దేశాన్ని దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఇప్పటికి ఒక్క గ్యారంటీని నెరవేర్చలేదని ఆరోపించారు. దేశంలో అవినీతిరహిత పాలన కేవలం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వారసత్వ పార్టీలని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఏరుకొండ నర్సింహ, దినేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. నల్గొండ సీటు ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల జోరు ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాయి. ఇక, ఇటీవల కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో కూడా విజయం సాధించాలనే దిశగా హస్తం నేతలు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, కోమటిరెడ్డి గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం నా నల్గొండ సీటు త్యాగం చేసేందుకు కూడా సిద్దం. సమర్థవంతమైన వాళ్లకే టిక్కెట్లు ఇస్తాం. నా నియోజకవర్గంలో కూడా ఆరు అప్లికేషన్స్ వచ్చాయి. అందరి బలాబలాలను పరిశీలిస్తాం. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్ టూ వన్ మాట్లాడాలని రేవంత్ ప్రతిపాదించారు. రేవంత్ ప్రతిపాదనను అందరం ఆమోదించాం. డిక్లరేషన్‌ను తెలంగాణలో అమలు చేస్తాం.. అమలు చేయకపోతే రాజీనామా చేస్తాం. కేసీఆర్.. మూడెకరాలు ఇస్తా అని మాట తప్పాడు. మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు.. ఏం చేశాడు?. మొండెంతో తిరుగుతున్నాడా?. అని సెటైరికల్ పంచ్ వేశారు. ఎన్నికల ముందు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉంటుంది అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. టికెట్ల కోసం పోటీ.. ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్‌కు స్క్రీనింగ్ పరీక్ష టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అనేక నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక, సీనియర్లు పోటీపడుతున్న సీట్లలో కూడా టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ► జనగామలో పొన్నాల Vs కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ► వనపర్తిలో చిన్నారెడ్డి Vs మెఘారెడ్డి, శివసేన రెడ్డి ► ఎల్బీ నగర్లో మధు యాష్కీ Vs మల్రెడ్డి రంగారెడ్డి ► కల్వకుర్తిలో వంశీచందర్‌రెడ్డి Vs రాఘవరెడ్డి ► కొల్లాపూర్‌లో జూపల్లి Vs జగదీశ్వరరావు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇది కూడా చదవండి: కమలం నేతల్లో కొత్త టెన్షన్.. అసలేం జరుగుతోంది? -
కోట్లు వెదజల్లినా.. ఓటమి మూటగట్టుకున్న వ్యాపారవేత్తలు వీళ్లే
రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వ్యాపారవేత్తలకు ఆ నియోజకవర్గం మింగుడు పడటం లేదు. ఎన్నికల బరిలో నిలబడి ప్రజాధరణ పొందాలని ఆశించిన ఇద్దరు ప్రముఖ వ్యాపారస్తులకు ఎదురైన అనుభవాలే దీనికి నిదర్శనమని వారు విశ్లేషించుకుంటున్నట్లు సమాచారం. చేతిలో కోట్లాది రూపాయలు ఉన్నా సరే ఆ నియోజకవర్గంలో గెలవాలంటే కష్టమేనని భావిస్తున్నారు. ఇంతకీ ఆ అసెంబ్లీ స్థానం ఏదంటే.. వీరు వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే.. ఒకరకంగా చెప్పాలంటే తరాలు తిన్నా కానీ తరగని ఆస్తి సంపాదించుకున్నారు. ఆ దన్నుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని కలలు కన్నారు. కానీ వీరి ఆశలు అడియాశలు అయ్యాయి. వీరిని నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవడం లేదు. మరి ఈ వ్యాపార వేత్తలు ఎవరో కాదు. ఒకరు తేరా చిన్నప్పరెడ్డి అయితే.. మరొకరు వేమిరెడ్డి నరసింహారెడ్డి.. ఇద్దరూ వ్యాపారంలో బాగానే సంపాదించారు. సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ బ్యాలెట్ బరిలో మాత్రం విఫలమయ్యారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈ ఇద్దరూ ప్రజాధరణ పొందలేక పోయారు. నాగార్జున సాగర్‌కు చెందిన వ్యాపారవేత్త తేరా చిన్నప రెడ్డికి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటి ద్వారా బాగా సంపాదించారు. అలాంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత 2009లో టీడీపీ తరపున నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. చదవండి: కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు? తరువాత 2014లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి టీడీపీ తరపున నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడా సేమ్ రిజల్ట్స్. దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నారు. దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమిని మూటగట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఫుల్‌గా సంపాదించారు వేమిరెడ్డి నర్సింహరెడ్డి. మునుగోడుకు చెందిన ఆయన 2019లో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ కూడా నరసింహరెడ్డి అర్థ బలాన్ని చూసో లేక నల్లగొండలో పోటీ చేసే నేత కనిపించకనో తెలీదు కానీ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యర్థిగా లోక్‌సభ సీటు కేటాయించారు. అయితే నర్సింహరెడ్డి ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేసి హడావిడీ చేసినప్పటికీ అంచనాలు తలకిందులయ్యాయి. నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఒక్క హుజూర్నగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అపజయం పాలయ్యారు. కోట్లకు అధిపతులైన వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో చుక్కలు చూపించిన నియోజకవర్గంగా నల్లగొండ నిలిచిపోయింది. నల్లగొండ లోక్‌సభ సీటు పేరు చెబితేనే చాలు ఈ ఇద్దరు నేతలు నిద్రలో సైతం ఉలిక్కిపడుతున్నారని జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. -
అసలు కట్టప్పలు వేరే ఉన్నారు: ఉత్తమ్
సాక్షి, సూర్యాపేట: సామాజిక మాధ్యమాల్లో తనతో పాటు తన సతీమణి పద్మావతిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దీని వెనుక పార్టీకి చెందిన ముఖ్యుల హస్తం ఉందని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఫిర్యాదుతో అరెస్టయిన వారు చిన్న వారని, వారి వెనుక ఉన్న అసలు కట్టప్పలు త్వరలో బయటకు వస్తారన్నారు. తన సతీమణి పద్మావతి ఎయిర్‌పోర్టులో యాధృచ్చికంగా కొంత మంది బీఆర్ఎస్ మహిళా నేతలను కలుసుకుంటే.. ఆమె బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీలో వసతి కల్పించారంటూ ఎయిర్‌పోర్టు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఉత్తమ్ అన్నారు. కొంత కాలంగా తమను కావాలనే బదనాం చేస్తున్నారని, వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్నారు. ‘మీ అందరికీ తెలుసు. మాకు పిల్లలు లేరు. మీరే మా కుటుంబం అని రాజకీయం చేస్తున్నాం. మాకు వేరే వ్యాపకం, వ్యాపారం లేదు. 24 గంటలూ ప్రజా జీవితం, రాజకీయమే’అని ఆయన తెలిపారు. కోదాడలో 50 వేల మెజారిటీ రావాలి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి అధికార పార్టీని చిత్తుగా ఒడిద్దామని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కోదాడలో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని, 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ -
చంపుతమని తిరుగుతున్నరు.. కోమటిరెడ్డి ఆడియో కలకలం!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బెదిరించినట్లుగా ఉన్న ఆడియో లీక్ అయ్యింది. అసభ్యంగా వారిద్దరినీ దూషించినట్లున్న ఆ ఆడియో ఆదివారం కలకలం రేపింది. అసలు ఆడియోలో ఏముందంటే.. ‘చూసినవా స్టేట్మెంట్.. (అంకుల్ అది వాట్సప్‌లో అట్ల ఇచ్చిండు కానీ ఆ వీడియో ఒకసారి మీరు పూర్తిగా చూడండి–ఎదుటి వ్యక్తి వాయిస్) ఏం చూసుడు. వాన్ని చంపుతమని తిరుగుతున్నరు. వంద మంది వెహికిల్ వేసుకొని తిరుగుతున్నరు. ఈ వీడియో కాదు నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజులు ఓపిక పట్టి ఇప్పుడు వంద కార్లలో వాణ్ని చంపుతమని తిరుగుతున్నరు. నిన్ను కూడా చంపుతరు. నీ హాస్పిటల్‌ను కూడా కూలగొడుతరు. లక్షల మందిని బతికించిన నేను. వానికెంత ధైర్యం నిన్న మొన్న పార్టీలకొచ్చి.. వాణ్ని వదిలిపెట్టర్రా.. నేను చెబుతున్న నీకు, వార్నింగ్ ఇస్తున్న. నేను ఆపలేను .. క్షమించమని చెప్పి, నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్లు ఇచ్చిండు ఓపిక పట్టిండ్రు. సార్ మాతో ని కాదిగ, నువ్వేమో ఏమనొద్దంటున్నవ్ సార్.. మేము వెళ్లినం బయటికి, యాడ దొరికితే ఆడ చంపేస్తం అంటుండ్రు వాళ్లు. నా తోని కాదు.. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తరు... అసోంటి వంద వీడియోలు, డైరెక్టు పేరు పెట్టి వందసార్లు తిట్టిండు వాడు. ఇప్పుడొక బ్యాచ్ వెళ్లింది. నిన్ను కూడా చంపుతరు చెబుతున్న అరేయ్... నీ హాస్పిటల్ నడువదు. 25 ఏళ్లలో లక్షల మందిని బతికించిన నేను. వారందరిని కంట్రోల్ చేస్తానా నేను. అతనికి ఫోన్ చేసి చెప్పు.. అరేయ్ నీకు పార్టీ ఉన్నదారా.. ఇంటిపార్టీ ఏందిరా.. నువ్వు కౌన్సిలర్‌గా గెల వవు.. ఆయన అంతపెద్ద లీడరు అని చెప్పు. వాడు జైళ్ల పడితే నేను ఒక్కడినే పోయిన. ఎవరూ పోలే అప్పుడు. చెప్పు.. వారంకంటే ఎక్కువుండడాడు’. కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం డాక్టర్ చెరుకు సుధాకర్‌ను, ఆయన కుమారుడిని చంపుతామంటూ బెదిరించినట్లుగా ఆడియో లీక్ నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ గడియారం సెంటర్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేశారు. కాగా, ఎంపీ కోమటిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని బీసీ యువజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దరిద్రుడు, చీడపురుగంటూ నన్ను తిట్టుడేంది: కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటినుంచి చెరుకు సుధాకర్ నాపై కామెంట్స్ చేస్తుండు. ఒకసారి దరిద్రుడని, మరోసారి చీడపురుగని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నడు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నరని ఆయన కొడుకును అడిగితే పెడితేఏంది అంటూ వంకర టింకర మాట్లాడుతుండు. ఇది ఎంతవరకు కరెక్టు. పార్టీకి పని చేయాలి. నన్ను తిట్టుడేంది? నా కొడుకుకు ఫోన్ చేసి నన్ను తిట్టడం ఆశ్చర్యం కలిగించింది: చెరుకు సుధాకర్ వెంకట్‌రెడ్డి అసభ్యంగా నన్ను తిట్టడం అశ్చర్యం కలిగించింది. నేను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా, అతను స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి ఒకే పారీ్టలో పని చేస్తున్నా నాపై అత్యంత నేరపూరితమైన, టెర్రరిస్టు భాష మాట్లాడారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో.. మతి లేక మాట్లాడుతుండో అర్థం కావడంలేదు. ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించా. కోమటిరెడ్డిని నేను వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవు. నయీం లాంటి కరుడు గట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకయాడు. కోమటిరెడ్డి ఏం చేస్తాడు? ఈ వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. -
ఉత్తమ్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆయన శనివారం కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే, ఛాతీ భాగంలో కొంత ఇన్ఫెక్షన్ ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో చేరినట్టు సమాచారం. కాగా.. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తనకు కోవిడ్ నిర్ధారణ కాలేదని, ఊపిరితిత్తుల సీటీ స్కానింగ్‌లోనే ఈ విషయం వెల్లడైందని ఉత్తమ్ తెలిపారు. తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: ఆ ‘నలుగురు’గా మారిన ముస్లిం యువత Got a CT lung scan today. Pneumonia caused by Covid detected. People who have been in contact with me, kindly get tested. Both rapid & RT PCR tests failed to detect COVID in my case. Urge you to go for lung CT scan if symptoms persist despite negative RTPCR/Rapid antigen tests. — Uttam Kumar Reddy (@UttamTPCC) April 24, 2021 -
అంతర్రాష్ట్ర వారధి నిర్మించా..ఆదరించాలి
మఠంపల్లి : తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న మట్టపల్లి వద్ద క్రిష్ణానదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో రూ.50కోట్లు మంజూరు చేసి అంతరాష్ట్ర వారథి హైలెవల్ వంతెన నిర్మాణానికి కృషి చేసినందున ఆదరించి కాంగ్రెస్‌పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మట్టపల్లి, పెదవీడు, మఠంపల్లి, రఘునాథపాలెం, తదదితర గ్రామాలలో రోడ్‌షో నిర్వహించారు. ముందుగా ఆయన హైలెవల్ వంతెనను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలలో మాట్లాడారు. కిష్టపట్టె ప్రాంతం వ్యవసాయాభివృద్ధితో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు రైల్వేలైను, హైలెవల్ వంతెన, సబ్స్టేషన్లు నిర్మించానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈప్రాంత అభివృద్దికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. కాగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలతో ఉత్తమ్‌కు ఘన స్వాగతం పలికారు. -
నేడు తేలనున్న నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ వర్గాల్లో అంతకంతకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపనున్నారో ఇంకా గోప్యంగానే ఉంది. ఆ పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. హోలి పండుగ సందర్భంగా గురువారం తమ మిగతా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. అదేగనుక నిజమైతే నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ పడనున్నారో తేలిపోతుంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ పదమూడు మంది అభ్యర్థులను ప్రకటించగా, మరో మూడు స్థానాలే మిగిలి ఉన్నాయి. ఆ మూడింటిలో నల్లగొండ ఒకటి. గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండనుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మూడో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. వాస్తవానికి అప్పటి దాకా ఆయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నా.. నేరుగా టీఆర్ఎస్తో సంబంధాలు లేకపోవడం, ఒకేసారి అభ్యర్థిగా తెరపైకి రావడం, స్థానిక పరిస్థితుల వల్ల గెలవలేకపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి 1.93లక్షల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై విజయం సాధించారు. కొన్నాళ్లకు గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. కానీ, ఈ ఎన్నికల విషయానికి వచ్చే సరికి సిట్టింగ్గా ఉన్న గుత్తాకు టికెట్ ఇంకా ఖరారు కాలేదు. చర్చలోకి.. కొత్త పేర్లు శాసనసభ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఏకంగా ఆరు చోట్ల విజయం సాధించింది. దీంతో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కితే చాలు.. తేలిగ్గా గెలవచ్చన్న అభిప్రాయానికి పార్టీ నాయకులతోపాటు, బయటి వ్యక్తులూ భావించారు. ఈ కారణంగానే నల్లగొండ ఎంపీ టికెట్‌కు ఒకింత పోటీ ఎక్కువైందని చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన తేరా చిన్నపరెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన స్థానిక సంస్థల మండలి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన ఇప్పుడు నల్లగొండ ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కంచర్ల కృష్ణారెడ్డి .. తదితర పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యలోనే పార్టీతో ఎలాంటి సంబంధం లేని తటస్థుడిగా ఉన్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యాపార వేత్త వేమిరెడ్డి నర్సింహారెడ్డి టికెట్ ఆశిస్తూ పార్టీ నాయకత్వం వద్ద ప్రయత్నాలు కూడా సాగించారు. అయితే, పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఇప్పటి దాకా ఎటూ తేల్చలేదు. తెరపైకి సిట్టింగ్ ‘గుత్తా’ పేరు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా హుజూర్నగర్ ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. దీంతో ఈ స్థానంనుంచి బలమైన అభ్యర్థినే పోటీకి పెట్టాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ హైకమాండ్ ఉందని అంటున్నారు. దీంతో కొత్తవారికి టికెట్ ఇచ్చి ప్రయోగం చేయడమా..? లేదంటే ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన సీనియర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పోటీకి నిలబెట్టడమా..? అన్న చర్చ పార్టీలో జరుగుతోందని చెబుతున్నారు. ఈ కారణంగానే సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చిందని చెబుతున్నారు. అయితే, ఇప్పటి దాకా గుత్తా తాను ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తానని కానీ, చేయనని కానీ స్పష్టం చేయలేదు. పార్టీ అధినేత తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై మంత్రివర్గంలో చేరతారని, పార్టీ మారిన సమయంలో అధినేత కేసీఆర్ అదే హామీ ఇచ్చారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయనను ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి దాకా ప్రకటించ లేదా అన్న చర్చ కూడా ఉంది. తాజా పరిణామాలు, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత నల్లగొండ నుంచి గుత్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుత్తాకు టికెట్ ఇస్తారా..? ఈ స్థానం నుంచి మరెవరైనా పార్టీ నేతకు అవకాశం ఇస్తారా..? కొత్తవారిని పోటీ చేయిస్తారా..? అన్న ప్రశ్నలకు గురువారం సమాధానం లభించనుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్.. వ్యూహాత్మకం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ సీనియర్లకే టికెట్లు దక్కాయి. ముందునుంచీ ప్రచారానికి భిన్నంగా పార్టీ నాయకత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. తమకు పట్టున్న జిల్లాలో, ఆ పట్టును కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా తమ అభ్యర్థులను ఎంపిక చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా తమకు బాగా పట్టున్న నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం (పూర్వపు మిర్యాలగూడ నియోజకవర్గంలోని సెగ్మెంట్లు నల్లగొండలో కలిశాయి)లో తమకు గెలుపునకు అవకాశాలు మెండుగా ఉంటాయన్న అంచనాతో అభ్యర్థుల ఖరారు విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడం లేదని, ఇక్కడి స్థానాన్ని దక్కించుకునేందుకు సీరియస్‌గానే ఉన్నామన్న సంకేతాలను పంపించేందుకే ఏకంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని బరిలోకి దింపుతోందని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో నల్లగొండనుంచి కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ ఎన్నికల్లో అనుకూలంగా పవనాలు వీచినా, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకంగా ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు, నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని అత్యధికంగా 1.93లక్షల మెజారిటీతో కైవసం చేసుకుంది. దీంతో తమ ఓటు బ్యాంకు ఎంత బలమైందో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నిరూపించుకుంది. కానీ, 2018 అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం హుజూర్నగర్ మాత్రమే నిలబెట్టుకుని మిగిలిన ఆరు స్థానాలు కోల్పోయింది. వాటిని టీఆర్ఎస్ దక్కించుకుంది. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఆ అవకాశం ఇవ్వకుండా గట్టి అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న వ్యూహంలో భాగంగానే పీసీసీ సారథిని నిలబెడుతున్నారని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు... అగ్నిపరీక్ష ఈ పార్లమెంటు ఎన్నికల్లో వాస్తవానికి కాంగ్రెస్‌కు ఒక విధంగా అగ్నిపరీక్షే కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలవగా, ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ 1,07,601 ఓట్లు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ విజయం సాధించినా.. అక్కడి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేవలం 7,466 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈ మెజారిటీని మినహాయించి చూసినా.. టీఆర్ఎస్ లక్ష ఓట్ల మెజారిటీని కలిగి ఉంది. అంతే కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఆరుగురు ఎమ్మెల్యేలు నిలవనుండగా, కాంగ్రెస్ అభ్యర్థి ఒక విధంగా ఒంటరి పోరు చేయాల్సిందే. గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. నాటి ఎంపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్ల మెజారిటీని పోలిస్తే.. టీఆర్ఎస్.. కాంగ్రెస్‌లు సమ ఉజ్జీలుగా ఉన్నట్టే లెక్క. అంతే కాకుండా నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో మాత్రం టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యమే వచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం తమదే అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోతే పోటీపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు. -
నల్లగొండకు దేశవ్యాప్త గుర్తింపు
సాక్షి, నల్ల గొండ : పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక సహా 2014 వరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో ద్విసభా నియోజకవర్గాలుగా ఉంది. నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడెం, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీబీ రావుపై గెలిచారు. ఆ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డికి ఏకంగా 2,72,280 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీ. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే రావికి ఎక్కువ ఓట్లు రావడంతో పార్లమెంట్ భవనంలోకి తొలి అడుగు పెట్టే (ప్రారంభోత్సవం) అవకాశం రావి నారాయణరెడ్డికి దక్కింది. తొలి ఎన్నికల్లో రావి పీడీఎఫ్ నుంచి పోటీ చేసి గెలిచారు. సాయుధ పోరాటాన్ని నడిపిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)పై నిషేధం ఉండడంతో సాయుధపోరాట యోధులంతా తొలి ఎన్నికల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య వేదిక (ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ /పీడీఎఫ్) తరపున పోటీ చేశారు. దేశంలో తొలి ఎన్నికల్లో 489 పార్లమెంట్ స్థానాల్లో ఆ రకంగా నల్లగొండకు గుర్తింపు లభించింది. రావి నారాయణరెడ్డి తిరిగి 1962లో జరిగిన మూడో ఎన్నికల్లో నల్లగొండ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేవీపీ రావుపై 33,396 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా 1960లో నల్లగొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ నుంచి వి.కాశీరాం ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్దయ్యపై విజయం సాధించారు. అతిరథ నాయకులు గెలిచిన నియోజకవర్గం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దేశ వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో పేరున్న నాయకులే పోటీ చేసి గెలిచారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డితో పాటు దేవులపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షం కూడా ఈ స్థానం నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టిన వారే. 1957 ఎన్నికల్లో నల్లగొండ ద్విసభకు దేవులపల్లి వెంకటేశ్వరావు పీడీఎఫ్ నుంచి పోటీపడి కాంగ్రెస్ అభ్యర్థి జీఎస్‌రెడ్డిపై 53,214 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్‌రెడ్డి ఈ నియోజకవకర్గం నుంచి 1998, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే ఈ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు గెలిచి రికార్డు సాధించారు. మొదట ఆయన టీడీపీ నుంచి 1999 ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచాక ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆది నుంచీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యనే పోరు సాగింది. టీడీపీ కేవలం రెండు సార్లు గెలవగా, బీజేపీ అసలు బోణీ చేయలేదు. 1971 ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ఒక సారి ఇక్కడి నుంచి గెలిచింది. మొత్తంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల చరిత్ర అంతా ఆసక్తికరంగానే ఉంది. -
నల్లగొండలో.. ముగ్గురంటే ... ముగ్గురే !
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఇన్నేళ్ల ఎన్నికల చరిత్రలో కేవలం ముగ్గురు మాత్రమే మూడేసి సార్లు ఎంపీలుగా విజయాలు సాధించారు. వర్తమాన రాజకీయాల్లో జిల్లాలో ఆ ఘనత సాధించింది గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. నల్లగొండ నియోజకవర్గానికి 1952 నుంచి ఎన్నికలు జరుగుతుండగా, 1962 నుంచి 2004 వరకు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మిర్యాలగూడ రద్దయ్యింది. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు నల్లగొండ పరిధిలోకి, నల్లగొండ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, పూర్వపు వరంగల్ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లతో కలిసి 2009లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మూడు సార్ల ఘనత .. ముగ్గురిదే నల్లగొండ నియోజకవర్గం నుంచి మొత్తంగా మూడుసార్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రమే గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన టీడీపీ తరఫున 1999 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కనుకుల జనార్దన్‌రెడ్డిపై 79,735ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి సురవరం సుధాకర్ రెడ్డిపై విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచే రెండోసారి (మొత్తంగా మూడో సారి) 2014 ఎన్నికల్లో పోటీ చేసిన గుత్తా టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి పై 1,93,156 ఓట్ల భారీ మెజారిటీతో గెలు పొందారు. ఈ నియోజకవర్గం నుంచి కేవలం సుఖేందర్‌రెడ్డి మాత్రమే మూడు పర్యాయాలు గెలవగా.. రావి నారాయణరె డ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, సురవరం సుధాకర్ రెడ్డి రెండేసి సా ర్లు గెలిచారు. ఈ ముగ్గరూ సీపీఐ నేతల కావడం గమనార్హం. రద్దయిన మిర్యాలగూడనుంచి ... ఇద్దరు మిర్యాలగూడెం పార్లమెంటు నియోజకవర్గం 1962లో ఏర్పడగా, ఆ ఏడాది జరిగిన ఎన్నికల నుంచి మొదలు 2004 ఎన్నికల వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ పన్నెండు ఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నడుమనే సాగింది. ఇక్కడి నుంచి ఇద్దరు నాయకులు మూడేసి సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జి.ఎస్.రెడ్డి 1967 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డి.వి.రావుపై తొలి విజయం నమోదు చేసుకున్నారు. తిరిగి ఆయన 1977, 1980 ఎన్నికల్లో రెండు సార్లూ .. సీపీఎం అభ్యర్థి భీమిరెడ్డి నర్సింహారెడ్డిపైనే గెలిచి మూడు పర్యాయాలు గెలిచిన రికార్డు నెలకొల్పారు. మరోవైపు 1971 ఎన్నికల్లో సీపీఎం నుంచి భీమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డిపై ఎంపీగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చకిలం శ్రీనివాస రావుపై, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి బద్దం నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. దీంతో భీమిరెడ్డి కూడా ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన ఎంపీగా రికార్డు సమం చేశారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బద్దం నర్సింహారెడ్డి, ఎస్.జైపాల్‌రెడ్డి రెండేసి పర్యాయాలు గెలిచారు. -
నల్లగొండ ఎంపీ స్థానం నుంచే కేసీఆర్ పోటీ..?
నల్లగొండ : జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుల నుంచి భారీ మద్దతు లభించింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కలిసికట్టుగా కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నయ శక్తిగా దేశంలో మూడో ఫ్రంట్ ఆవశ్యత గురించి సమావేశంలో సీఎం వివరించారు. ప్రత్యామ్నయ కూటమి ఏర్పాటు చేస్తే దేశంలో టీఆర్ఎస్ ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లా మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిశోర్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేంద ర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చాడ కిషన్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మధర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కంచర్లభూపాల్ రెడ్డి, నోముల నర్సింహయ్య తదితరులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ నుంచే పోటీ..! సాధారణ ఎన్నికలకు ఏడాది ముందుగానే జాతీయ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని సీఎం ప్రకటన చేయడంపై నల్లగొండ జిల్లా నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచే కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజా పరిణామలు.. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. నల్ల గొండ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ బరిలో దిగితే ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ వశమవడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ నిర్వహించే సర్వేలో జిల్లాలో మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తేలింది కాబట్టి, ఎంపీగా కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే తమకు మరింత మేలు జరుగుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్తమ్, కోమటిరెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారు?
నల్గొండ : తెలంగాణ న్యాయవాదుల సమస్యలపు వెంటనే పరిష్కరించాలని కేంద్రప్రభుత్వాన్ని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలో ఎంపీ గుత్తా మాట్లాడుతూ... న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిని సస్పెండ్ చేయడం బాధకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంలో మరోసారి పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టుకు ఈ సందర్భంగా గుత్తా సూచించారు. నల్గొండ జిల్లాకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు వరప్రదాయని అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ జిల్లాకు 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. తెలంగాణలో ఓ ఎకరా కూడా పారని పులిచింతలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. -
'వారిద్దరే పార్టీలో సమర్థులైన నేతలు'
నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాచరికపు వ్యవస్థ కొనసాగుతోందని ఆరోపించారు. ఫిరాయింపుల వల్లే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పీసీపీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డిలే కారణమంటూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని గుత్తా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పార్టీలో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి కంటే సమర్థవంతమైన నేతలు ఎవరూ లేరని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్'
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్‌కు ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని నల్గొండ లోక్‌సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. నిధులు పంచే రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులు రాష్ట్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో లక్ష కోట్లు అప్పులు కాగా ఏడాదిన్నర కేసీఆర్ పాలనలోనే 10 జిల్లాల తెలంగాణ లక్ష కోట్ల అప్పుల పాలైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ నడుస్తున్నారని విమర్శించారు. అందుకే ఆయన తరహాలనే కేసీఆర్ ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచుతున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. -
'ఘర్షణ జరిగితేనే కానీ... చర్చలకు రాలేదు'
హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇరు రాష్ట్ర పోలీసుల మధ్య ఘర్షణకు సీఎంలు చంద్రబాబు, కేసీఆరే కారణమని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మధ్య గొడవ జరిగితేనే కానీ... ఇద్దరు సీఎంలు చర్చలు జరిపేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. ఎడమ కాల్వ నుంచి నీటిని విడుదల చేయకపోతే 2.50 లక్షల ఎకరాల్లోని పంటలు ఎండిపోతాయన్నారు. రైతులు ప్రయోజనాలు తాకట్టు పెడుతూ సెంటిమెంట్‌తో ఇద్దరు సీఎంలు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పంటలు ఎండిపోతే మీదే బాధ్యత అని ఇద్దరు సీఎంలదే బాధ్యత అని ఈ సందర్బంగా హెచ్చరించారు. కృష్ణా రివర్ బోర్డుకు అధికారం ఇచ్చి... ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి.. కేంద్రానికి సూచించారు. -
వీఐపీ రిపోర్టర్ - గుత్తా సుఖేందర్ రెడ్డి
-
కేసీఆర్‌ది నిరంకుశ పాలన
రాంనగర్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రుణమాఫీపై రోజుకో మెలిక పెడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాడని విమర్శించారు. సమగ్ర సర్వే చెత్తబుట్టలో వేసుకోవడానికి తప్ప, ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చుచేసి శ్రీశైలం సొరంగమార్గం పనులు మొదలు పెట్టిందని, మరో రూ.1200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయి జిల్లాకు సాగు, తాగునీరందుతుందన్నారు. నక్కలగండి ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వీటన్నిం టనీ పక్కన పెట్టి జారాల-పాకాల పాట పాడడం సరైంది కాదన్నారు. అది పూర్తయ్యేసరికి కేసీఆర్ కూడా బతికి ఉంటాడో లేదో తెలియదన్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు తప్ప ఇతర మంత్రులకు ప్రజల సంక్షేమం, పథకాలపై ఏ మాత్రమూ అవగాహన లేదని విమర్శించారు. సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ దానిని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరిని దద్దమ్మలు అనే కేసీఆర్ ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గంలో పనిచేసిన ఆయన కూడా దద్దమ్మేనా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు పిట్టలదొర పద్మభూషణ్ డాక్టర్ అవార్డు కూడా ఇవ్వవచ్చని చురక అంటించారు. ఒక్క పథకమూ అమలుచేయని కేసీఆర్ జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ కేసీఆర్ 102రోజుల పాలనలో ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. రైతుల రుణమాఫీ, ఉచిత కరెంట్‌ను ఒక్క సంతకంతో అమలు పర్చారన్నారు. రుణమాఫీ కాని రైతులకు కూడా వైఎస్సార్ రూ.5 వేలు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ప్రతిపక్షాలను సన్నాసులని, చెల్లని రూపాయి అని విమర్శించడం తగదని కేసీఆర్‌కు హితవు పలికారు. సంక్షేమ పథకాల అమలులో విఫలం డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు కరెంట్ కోతలతో సతమతమవుతుంటే రుణమాఫీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షే మ పథకాలు అమలు చేయడంలో విఫలమైం దన్నారు. సర్కారు వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రజలకు సినిమా చూపెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం జేసీప్రీతిమీనాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సుంకరి మల్లేష్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, కాంగ్రెస్ సర్పం చుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శిశుపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల నారాయణగౌడ్, కాంగ్రెస్ ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రాంరెడ్డి, రవీందర్‌రెడ్డి, హన్మంతరావు, కత్తుల కోటి, కొంటేడి మల్ల య్య, పోలు డేవిడ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
'బాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం'
తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తే ఊరుకోమని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును హెచ్చరించారు. నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... తమతో పొత్తుపెట్టుకున్న బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా అని తెలంగాణ రాష్టంపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం తొందరపడకూడదని ఆయన మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీఎంలతో చర్చించి పోలవరం సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. మోడీ కేబినెట్లో తెలంగాణకు చోటు దక్కకపోవడం బాధాకరమన్నారు.