హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్కు ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని నల్గొండ లోక్సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. నిధులు పంచే రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులు రాష్ట్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో లక్ష కోట్లు అప్పులు కాగా ఏడాదిన్నర కేసీఆర్ పాలనలోనే 10 జిల్లాల తెలంగాణ లక్ష కోట్ల అప్పుల పాలైందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ నడుస్తున్నారని విమర్శించారు. అందుకే ఆయన తరహాలనే కేసీఆర్ ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచుతున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు.