![Gutha Sukender Reddy Interesting Comments On Tamilisai Soundararajan - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/8/Gutha-Sukender-Reddy.jpg.webp?itok=eIxpWztV)
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎస్ శాంతి కుమారిపైన కూడా గవర్నర్ తమిళిసై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌పై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, నల్లగొండలో సుఖేందర్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గవర్నర్ అంటే మాకు గౌరవం ఉంది. చిన్న చిన్న విషయాల్లో ఆరోపణలు చేయడం సరికాదు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీలో తెలంగాణ అద్భుతంగా ఉందని ప్రసంగించారు. కానీ, బయట మాత్రం పలు వ్యాఖ్యలు చేస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు.
అలాగే, తెలంగాణలో కూడా రాజకీయాల పార్టీల తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల వ్యవహారం ఆక్షేపనీయంగా ఉంది. రాజకీయాలను భ్రష్టు పటిస్తున్నారు. కొన్ని పార్టీల నేతలు బూతు పురాణాలు ఎత్తుకుంటున్నారు. ఇలా మాట్లాడటం వల్ల ప్రజల్లో తమ విలువ కోల్పోతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment