ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా | bjp election campaign in nalgonda | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా

Published Sun, Apr 28 2024 11:36 AM | Last Updated on Sun, Apr 28 2024 11:36 AM

bjp election campaign in nalgonda

నల్లగొండ: తనను గెలిపిస్తే ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి పరిష్కార మార్గం చూపుతానని బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి హాలియా పట్టణంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి మాజీ మంత్రి జానారెడ్డి చేసిందేమీ లేదన్నారు. 

నియోజకవర్గంలో పేదలకు సరైన వైద్యం అందక హైదరాబాద్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంకణాల నివేదితారెడ్డి, హాలియా మున్సిపాలిటీ ఇన్‌చార్జి మన్నెం రంజిత్‌యాదవ్, చెన్ను వెంకటనారాయణరెడ్డి, డాక్టర్‌ పానుగోతు రవికుమార్, చలమల్ల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

దాచుకోవడం, దోచుకోవడమే కాంగ్రెస్‌ లక్ష్యం
పెద్దవూర: అధికారంలోకి వస్తే దాచుకోవడం, దేశాన్ని దోచుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఇప్పటికి ఒక్క గ్యారంటీని నెరవేర్చలేదని ఆరోపించారు. దేశంలో అవినీతిరహిత పాలన కేవలం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వారసత్వ పార్టీలని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఏరుకొండ నర్సింహ, దినేష్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement