
'వారిద్దరే పార్టీలో సమర్థులైన నేతలు'
నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి శుక్రవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాచరికపు వ్యవస్థ కొనసాగుతోందని ఆరోపించారు. ఫిరాయింపుల వల్లే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందని విమర్శించారు.
జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పీసీపీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డిలే కారణమంటూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని గుత్తా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పార్టీలో జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి కంటే సమర్థవంతమైన నేతలు ఎవరూ లేరని గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు.