
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం మాజీ సీఎం కేసీఆర్‌తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డితో పాటు ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సుఖేందర్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు కూడా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
ఎమ్మెల్యే విజయుడికి కేసీఆర్ ఆశీస్సులు
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మంగళవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి కూడా ఉన్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే అబ్రహాంను అలంపూర్ అభ్యరి్థగా ప్రకటించి చివరి నిమిషంలో కేసీఆర్ విజయుడికి బీ ఫారాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ చల్లాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న విజయుడు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని విజేతగా నిలిచారు.