T congress leader
-
ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు!
నేరేడుచర్ల: రాష్ట్రంలో ఆరు నెలల్లో అసెంబ్లీ రద్దు కావడం ఖాయమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పెంచికల్‌దిన్నె, కల్లూరు, దాసారం, యల్లారం, ముకుందాపురం, బురుగులతండా, సోమారం, చిల్లేపల్లి, బొడలదిన్నె, జగనతండా గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పూర్తిగా విఫలమైందని, సర్పంచ్‌లను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. గతంలో చేసిన పనుల బిల్లులు ఇప్పటి వరకూ రాకపోవడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె ప్రగతి కార్యక్రమాలకు వెళ్లేందుకు భయపడుతున్నారని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, పింఛన్లు పూర్తి స్థాయిలో అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల రైతు బంధు ఇస్తామన్నారు. భూమిలేని రైతు కూలీలకు, జాబ్‌కార్డులున్న ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో పాటు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.12వేల చొప్పున అందిస్తామని చెప్పా రు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చూస్తామన్నారు. అలాగే రైతులకు పంట బీమాతో పాటు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయాస్తం పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిచ్చి, బకాయిలను చెల్లిస్తామని పేర్కొన్నారు. -
కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ
-
కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ
జీహెచ్ఎంసీ కుంభకోణంలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ డిమాండ్ చేశారు. అక్కడ జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే.. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. దోచుకోవడంలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ నెంబర్ వన్ స్థానాల్లో నిలిచాయని విమర్శించారు. -
పీఎం అపాయింట్మెంట్ ఇవ్వకుంటే..
హైదరాబాద్: క్రిమిలేయర్ కారణంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శుక్రవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఈ అంశంపై త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలువనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్కు అధికారులు అవకాశం ఇవ్వకుంటే పార్లమెంట్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద కూర్చుని నిరసన తెలుపుతానని వీహెచ్ స్పష్టం చేశారు. క్రిమిలేయర్ కారణంగా రాష్ట్రంలో, కేంద్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 27 శాతం రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన బీసీ సంఘాలకు సూచించారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీ, డైరెక్టర్ లేక సిలబస్ పూర్తి కాలేదని విమర్శించారు. -
మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించను
హైదరాబాద్ : తన శాఖ మార్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లో నిరాకరించారు. మర్రి శశిధర్రెడ్డివి గాలి మాటలు అని ఆయన అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యాలపై తాను స్పందించను అని తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. వెటర్నరీ శాఖలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. -
'వారిద్దరే పార్టీలో సమర్థులైన నేతలు'
నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాచరికపు వ్యవస్థ కొనసాగుతోందని ఆరోపించారు. ఫిరాయింపుల వల్లే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పీసీపీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డిలే కారణమంటూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని గుత్తా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పార్టీలో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి కంటే సమర్థవంతమైన నేతలు ఎవరూ లేరని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'ఆ కాంట్రాక్టర్ల కోసమే రూ. 2 వేల కోట్లు'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత షబ్బీర్ అలీ శనివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ సర్కార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌కు పేరు మార్చి రీడిజైన్ చేస్తామని చెప్పారు. పాత పేరుతోనే రూ. 2 వేల కోట్లు ఎందుకు రిలీజ్ చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు ఆర్థిక సాయం చేసిన కాంట్రాక్టర్ల కోసమే ఈ రూ. 2 వేల కోట్లు అని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా ఈ ప్రభుత్వం మారుస్తుందని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 75 కోట్లు పెంచడం సమంజసం కాదని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. -
'కేసీఆర్ మెదక్ జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సచివాలయానికి వచ్చిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు వాగ్దానం చేసినా... నిధులు కూడా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయింపు ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఎస్ఎల్బీసీ సొరంగం ఎందుకు ఆలస్యమైందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వెంకటరెడ్డి నిలదీశారు. -
ఎందుకు సార్ అపశకునం మాటలు?
పార్లమెంటులో ఏం జరిగింది-39 (నిన్నటి తరువాయి) స్పీకర్ చాంబర్స్లోంచి లోక్ సభలోకి వచ్చేశారు... టి. కాంగ్రెస్ ఎంపీలు, జైపాల్‌రెడ్డి. ఎవ్వరూ మాట్లాడే ధైర్యం చెయ్యలేదు. జైపాల్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అతి తీవ్రంగా నడిచిన 1969 లో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ వైపే నిలబడిన చరిత్ర జైపాల్‌రెడ్డి గారిది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినా, కాంగ్రెస్ ఎంపీలందరూ హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నా, ఈ విషయంలో ఆయన అభిప్రాయం తెలిపే ప్రయత్నమే చేయలేదు... 9.12.2009 వరకూ! ఒక ఎంపీ: సార్... మీరు చెప్పినట్లు స్పీకర్ చేస్తుందంటారా?! జైపాల్‌రెడ్డి: చేస్తుంది... బిల్ పాసవుతుంది... తెలంగాణ ఏర్పడుతుంది... మనకొచ్చే లాభం?! ఎంపీ: అదేంటి సార్, రేపటి ఎన్నికల్లో ‘స్వీప్’ చేస్తాం... అన్ని స్థానాలూ మనమే గెలుస్తాం. జైపాల్‌రెడ్డి: మనమే అంటే, కాంగ్రెస్ అభ్యర్థులమా... తెలంగాణ వాదులమా?! మరో ఎంపీ: రెండిటికీ తేడా ఏముంది సార్. ఇప్పు డు తెలంగాణ వచ్చిందంటే అది మన వల్లనే కదా... మేమెంత ప్రయత్నించినా మొహం మొహం చూసుకోవడానికే ఇష్టపడని సుష్మాస్వరాజ్, కమల్‌నాథ్‌లు స్పీకర్ ఎదురుగా గంటసేపు కూర్చుండి పోయారు గదా...! మీరు చెప్తుంటే వాళ్ల ముగ్గురే కాదు, మేమంతా కూడా నిశ్చేష్టులయిపోయాం. ఇంకో ఎంపీ: ‘లాస్ట్ బాల్’ వరకూ ఆడతామన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డే కాదు, మీరు బౌల్ చేసిన ‘లాస్ట్ బాల్’తో అందరూ కలసి అడ్డంగా నిలబడ్డా క్లీన్‌బౌల్డ్ అవ్వాలసిందే. జైపాల్‌రెడ్డి: మనం స్పీకర్ దగ్గరకు వెళ్తున్నట్లు కేసీఆర్‌కి తెలుసా? ఎంపీ: ఇందాకా కమల్‌నాథ్ దగ్గరకు మీరు మమ్మ ల్ని పంపినప్పుడు ‘లాబీ’లో కలిశాడు సార్! మొత్తం జరుగుతున్నదంతా చెప్పాం... జైపాల్‌రెడ్డి: ఆయనేమన్నాడు? ఎంపీ: మొత్తం విన్నాడు సార్... ఆయన్ని కూడా రమ్మని పిలిచాం. జైపాల్‌రెడ్డి: మరి ఏడి?! మరో ఎంపీ: వస్తానని చెప్పలేదు గానీ, వస్తానన్నట్టే మొహం పెట్టాడు. వస్తాడనే అనుకున్నాం. జైపాల్‌రెడ్డి: మరెందుకు రాలేదంటావ్?! మరో ఎంపీ: బహుశా ఇక్కడ మనం ‘సక్సెస్’ అవ్వ మేమోనని వచ్చి ఉండడు... అయినా మనకేం నష్టం సార్! ఆఖరుగా మనం వెళ్లకపోతే ‘తెలంగాణ’ రాష్ట్రమే లేదు కదా!! తెలంగాణ రాష్ట్రమే లేకపోతే, మనమూ లేము- కేసీఆర్ లేరు... జైపాల్‌రెడ్డి: తెలంగాణ రాష్ట్రం లేకపోతే కాంగ్రెస్, అంటే మనం లేము... రాష్ట్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా కేసీఆర్ మాత్రం ఉంటాడు. చదరంగం ఆటలో ఆటగాడు జాగ్రత్తగా చూసుకోకపోతే, ప్రత్యర్థి గుర్రంతో ‘చెక్’ పెడతాడు. ఆ ఎత్తుగానీ ప్రత్యర్థికి దొరికిందా, ఆటకట్టు... లేదా మంత్రి (క్వీన్) ఎగిరిపోవటం ఖాయం! కేసీఆర్ మనకి గుర్రంతో ‘చెక్’ పెట్టాడయ్యా!! ఇందాక వస్తానన్నట్టుగా మొహం పెట్టాడన్నావు... అతనెందుకు వస్తాడు, చిద్విలాసంగా నాటకమంతా చూస్తూ కూర్చుంటాడు. ఎంపీ: అదేమిటి సార్, తెలంగాణ రావటం మన కెంత అవసరమో ఆయనకీ అంతే అవసరం గదా...! జైపాల్‌రెడ్డి: ఈ రోజు తెలంగాణ బిల్లు పాసయితే కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి! పాసవ్వక పోతే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి!! అతని ఆటలో అతనికి పూర్తి ‘క్లారిటీ’ ఉంది. మనమాడుతున్న ఆటే ఎందుకాడుతున్నామో మనకి తెలియకుండా ఆడు తున్నాం... ఎంపీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు సార్? సీమాంధ్ర వారు తెలంగాణ మనిషికి ముఖ్య మంత్రి పదవిస్తారా?! జైపాల్‌రెడ్డి: ఖచ్చితంగా ఇస్తారు. సమైక్యం కోరుకునే వారు, తెలంగాణకి ముఖ్యమంత్రి ఇవ్వమని ఎలా అనగలరు? బిల్లు పాసవ్వకపోతే, కేసీఆర్ తెలంగాణలో, జగన్ సీమాంధ్రలో గెలుస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, జగన్ ఉపముఖ్యమంత్రి... ఎంపీ: ఎందుకు సార్ అపశకునం మాటలు? మీరు చేసిన కౌన్సిలింగ్ వృథా పోదు. స్పీకర్ మీరు చెప్పింది చెప్పినట్లు అమలు చేస్తుంది... బిల్లు పాసవుతుంది: ఆఖరి గంటలో మీరే స్పీకర్ చాంబర్కి రాకపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రమే లేదన్న విషయం మేము గట్టిగా ప్రచారం చేస్తాం... ముఖ్యమంత్రి మీరా, కేసీఆర్... అవుతారా అనేది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తేలుస్తుంది. జైపాల్‌రెడ్డి: (అసహనంగా) శకునాలు, దశలు, జాతకాలు, రాహుకాలం చూసుకుని మీరు పని చేస్తారు. సాధ్యాసాధ్యాలూ, వాస్తవిక పరిస్థితులూ బేరీజు వేసుకుని నేను పనిచేస్తాను. ఆఖరి గంటలో నేను మాట్లాడిన ఏమాట మీరు ‘పబ్లిగ్గా’ చెప్పినా, నేను ఖండిస్తాను. స్పీకర్ గదిలో జరిగిన మొత్తం మర్చిపోండి... ఆ మాటలు నేను అనలేదు - మీరు వినలేదు. ఇకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రో, కాదో కాంగ్రెస్ పార్టీ తేలుస్తుందంటున్నావు.. కేసీఆర్ కాంగ్రెస్‌లో చేరారా?! టీఆర్ఎస్ని విలీనం చేస్తారా?! ఎంపీ: తెలంగాణ బిల్లు పాసయిన మరుక్షణం కాంగ్రెస్‌లో కలిసిపోతానని మాటిచ్చాకే కదా... వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. జైపాల్‌రెడ్డి: చూశావా... నువ్వే చెప్పేస్తున్నావు... తెలంగాణ తీర్మానం, కేసీఆర్ మాటివ్వటం వల్లనే జరిగిందని...! ఇదే రేపు కేసీఆర్ చెప్తాడు... ‘‘నేను మాటివ్వకపోతే కాంగ్రెస్ వారు తెలంగాణ ఇవ్వమన్నారు... అందుకే మాటిచ్చాను... తెలంగాణ తెచ్చాను’’ అంటాడు. ఇంకో ఎంపీ: సార్ కన్ఫ్యూజ్ చెయ్యకుండా చెప్పండి సార్... మనం చేస్తున్నది రైటా... తప్పా.. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు : a_vundavalli@yahoo.com -
రూల్స్‌ని పాటించడం ‘మనిష్టం!’
పార్లమెంటులో ఏం జరిగింది-37 (నిన్నటి తరువాయి) రూల్స్, రాజ్యాంగం, చట్టాలు మనం తయారు చేసుకున్నాం. మనకి ఎలా వీలుగా ఉంటే అలా పాటించుకుంటాం. అధికార ప్రతిపక్షాలు కలిసిపోయాయి. మిగిలినవి అన్నీ చిన్న చిన్న పార్టీలు. వాళ్లు అరుస్తూనే ఉంటారు. మీరు బిల్లు పాస్ చేసేయండి. ‘పాస్’ అని ప్రకటించటమే గదా...! జైపాల్‌రెడ్డి: ఈ గొడవ ఇంక మానండి. మొత్తం సభ్యులెవ్వరూ మా మాట వినరు... అంటూ నాయకులిద్దరూ తేల్చేశారుగా... ఇంకో ఎంపీ: నిజమే సార్... ఒవైసీ పెట్టిన సవరణలు మేము చూడలేదు. నిజంగా ప్రాణహిత-చేవెళ్లకి, హైకోర్టుకి వ్యతిరేకంగా ఓటు వేసి హైద్రాబాద్ వెళ్లగలమా...!? ఇంతా జరిగి తెలంగాణ సాధించకుండా కూడా హైద్రాబాద్ వెళ్లలేం... జైపాల్‌రెడ్డి: మీరు ఆగండి బాబూ... ఎందుకంత భయపడ్తారు. తెలంగాణ బిల్లు పాసవుతుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి. కమల్‌నాథ్: నో చాన్స్... జైపాల్‌జీ, ఎన్ని సవరణలు పాసయిపోతాయో తెలీదు... ఒవైసీ, సౌగత్ రాయ్‌లు పెట్టిన ఒక్క సవరణ పాసు అయినా బిల్లు రూపమే మారిపోతుంది. సీమాంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం... ఇద్దరూ వ్యతిరేకిస్తే ఇంక ఈ బిల్లు ఎవరికోసం తెచ్చినట్టు...? సుష్మాస్వరాజ్: నేనూ అదే చెప్తున్నాను. బిల్లు వీగిపోతే మేమే కారణమని ప్రచారం చెయ్యాలను కుంటున్నారు... మాకు వచ్చిన నష్టమేమీ లేదు. రెండు ప్రాంతాల్లోనూ మా బలం అంతంత మాత్రం! కానీ కాంగ్రెస్ ఎన్ని అనర్థాలు సృష్టించిందో ప్రజలముం దుంచుతాం. తెలంగాణ పేరుతో ఎన్ని రోజులు పార్లమెంట్ స్తంభించారో జనానికి చెప్తాం. జైపాల్‌రెడ్డి: రేపు ఎన్నికలయ్యాక మళ్లీ అదే మొదలవుతుంది. మేము పదేళ్లు రాజ్యం చేశాం. రేపు వచ్చేది ఎన్డీయే. ప్రారంభం రోజు నుంచీ సభ జరగనివ్వరు. ఈ గొడవను ఈ ‘టర్మ్’లోనే ఎలా పూర్తి చేసేయాలో ఆలోచించమంటున్నాను. స్పీకర్: మీరే చెప్పండి. ఈ సమస్యకు పరిష్కారముందా? ఉంటే అదేమిటో చెప్పండి. జైపాల్‌రెడ్డి: నేనొక మార్గం చెప్తాను. (ఎంపీల వైపు చూస్తూ) మీరు కొంచెం సేపు నిశ్శబ్దంగా వినండి. ఇంతసేపూ మీరు బిల్లు ఓటింగ్‌లో గట్టెక్కటం ఎలా... అని తర్జనభర్జనలు పడుతున్నారు. దీనికోసం ఇంత టైం వేస్ట్ చెయ్యడం అనవసరం... ఓటింగ్ జరిగితే ఈ బిల్లు పాసవ్వటం జరగదు. ఇక్కడ మీరెవ్వరూ బుర్రపెట్టని యాంగిల్ ఒకటుంది... అసలు ఓటింగ్ ఎందుకు పెట్టాలి! స్పీకర్: నాకర్థం కాలేదు... ఓటింగ్ పెట్టాలి... అదే రాజ్యాంగం చెప్పింది. అదే లోక్‌సభ రూల్స్‌బుక్‌లో ఉంది. కమల్‌నాథ్: ఓటింగ్, డివిజన్ చేసి ఎటువైపు ఎంత మంది ఓటు వేశారో, ఎంత మంది తటస్థంగా ఉన్నారో ప్రకటించకుండా బిల్లు పాసయ్యిందని ఎలా డిక్లేర్ చేస్తారు? జైపాల్‌రెడ్డి: అదే చెప్తున్నాను. ‘వాయిస్ ఓటు’తో బిల్లు పాసయినప్పుడు ఓటింగ్ ఉండదు కదా..! సుష్మాస్వరాజ్: అదెలా సాధ్యం... మంత్రులే ‘వెల్’లో నినాదా లిస్తుంటే, వాయిస్ ఓటుతో పాసయిపోయిందని ఎలా క్లోజ్ చేస్తారు? ఇదేమైనా సీక్రెట్ మీటింగా... ప్రపంచమంతా చూస్తుంటుంది!? జైపాల్‌రెడ్డి: నేను చెప్పేది కాస్సేపు నిశ్శబ్దంగా వినండి. ఓటింగ్ జరపకుండా, డివిజన్ చెయ్యకుండా బిల్లు పాస్ చెయ్యటానికి ప్రొవిజన్ ఉంది. మీ ప్రధాన కార్యదర్శిని పిలిచి రూల్ 367(3) చూడ మనండి. స్పీకర్ అనవసరమనుకుంటే డివిజన్ నిరాకరించవచ్చు. స్పీకర్: అవును... నేను చూశాను. దాని మీద చర్చించాం. ఎప్పుడో 1956 ముందొకసారి ఆ ‘ప్రొవిజో’ వాడినట్లు రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత ఎప్పుడూ ఏ స్పీకరూ ఓటింగ్ నిరాకరించలేదు. జైపాల్‌రెడ్డి: రూల్ ఉందిగదా... ఎవరు వాడారు, ఎప్పుడు వాడారు అనేది కాదు ప్రశ్న! ఇప్పుడు వాడండి. ‘నో’ డివిజన్ అనండి. రూల్ చదవండి., బిల్లు పాసయ్యిందని ప్రకటిం చింది. దీనికెందుకింత చర్చ... స్పీకర్: సాధ్యం కాదు జైపాల్గారూ... ‘కౌల్ అండ్ షక్దర్’లో స్పష్టంగా వ్రాశారు. ‘పనికిమాలిన’ కారణాల వల్ల ఓటింగ్ అడుగు తున్నారని స్పీకర్ భావిస్తే, డివిజన్ నిరాకరించవచ్చు... అని! కానీ ఒక పెద్ద రాష్ట్ర విభజన, అసెంబ్లీ వ్యతిరేకించినా, పార్లమెంటు చేబట్టినప్పుడు... ఓటింగ్ అడగటం పనికిమాలిన కారణంగా స్పీకర్ ఎలా భావించగలరు! స్పీకర్ ఆఫీసు గౌరవం పోతుంది జైపాల్‌జీ... మీరు ఒప్పించి సవరణల మీద ఒత్తిడి తేకుండా, ఓటింగ్ అడగ కుండా సరిచేయండి. అంతేగానీ ఏదో క్లాజుకున్న అనుబంధ వాక్యాలని ఆసరాగా తీసుకుని ఇంత అఘాయిత్యం చేయలేము. జైపాల్‌రెడ్డి: ‘రూల్’లో ఏది ‘పనికిమాలిన’ కారణమో చెప్ప లేదు. స్పీకర్ ఇష్టం! అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పుడు, అది చదివి, ఎంతమంది బలపరుస్తున్నారో లెక్కపెట్టి, యాబైమంది లేకపోతే, నోటీసు తిరస్కరించి, అప్పుడు తర్వాత అంశంలోకి వెళ్లాలి. ఇదీ ‘కౌల్ అండ్ షక్దర్’లో రాసి ఉంది. శీతాకాల సమావేశాల్లో, ఈ సమావేశాల్లో... ప్రతిరోజూ అవిశ్వాసం నోటీసు ఇస్తూనే ఉన్నారు. ఒక్క రోజైనా రూల్ ప్రకారం మీరు వ్యవహరించారా?! అవిశ్వాసం చదవటానికి మాత్రం మీకు సభలో ‘ఆర్డర్’ కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదని అడిగితే, సీమాంధ్ర ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, శివసేన... యాభైకన్నా ఎక్కువ మందే అవిశ్వాసాన్ని సమర్థిస్తారు కనుక, ఈ నాల్రోజుల్లో అవిశ్వాసం చర్చ మొదలు పెట్టడం ఇష్టం లేదు కనుక... వంద మంది కాంగ్రెస్ ఎంపీలు, రాజ్‌బబ్బర్, అజారుద్దీన్ లాంటి సెలబ్రిటీలు, వెల్‌లోకి వచ్చి యుద్ధం చేస్తే, వారు మీకు కనిపించరు... ఆంధ్రప్రదేశ్ ఎంపీలని మాత్రమే సస్పెండ్ చేస్తారు... ఎందుకంటే అది మీ ఇష్టం కనుక. 13వ తారీఖున షిండేగారు బిల్లు ప్రవేశపెట్టేశారని మీరంటారు. సుష్మాస్వరాజ్ గారికి వినబడలేదు, పక్కనే ఉన్న మంత్రులకీ వినబడ లేదు, మీకు మాత్రమే వినబడుతుంది... ఎందుకంటే మీకిష్టం కాబట్టి మీకు వినబడింది. ఇన్ని అఘాయిత్యాలూ మీకు అఘాయిత్యాలుగా కనబడలేదు కాని ఈ రోజు రూల్ 367(3) అమలు చేస్తే మీకు అఘాయిత్యంగా కనిపిస్తోంది... ఎందుకంటే, మీకిష్టం లేదు కనుక! మేడమ్, రూల్స్, రాజ్యాంగం, చట్టాలు మనం తయారు చేసు కున్నాం. మనకి ఎలా వీలుగా ఉంటే అలా పాటించుకుంటాం. ప్రతిపక్షం వారు అడ్డుపడతారు - అల్లరి చేస్తారు - జరగనివ్వరు అనే ప్రశ్నే లేదు! అధికార ప్రతిపక్షాలు కలిసిపోయాయి. మిగిలినవి అన్నీ చిన్న చిన్న పార్టీలు. వాళ్లు అరుస్తూనే ఉంటారు. మీరు బిల్లు పాస్ చేసేయండి. ‘పాస్’ అని ప్రకటించటమే గదా... స్పీకర్: ఎంత తేలిగ్గా చెప్తున్నారు జైపాల్‌రెడ్డి గారూ... ఓటింగ్ నిరాకరించినా, ఎంత మంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరే కమో లెక్కపెట్టి, సంఖ్య ప్రకటించి, బిల్లు పాసయ్యింది అని ప్రకటిం చాలి... ఇది సాధ్యమేనా?! ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు : a_vundavalli@yahoo.com -
దానంను తప్పిస్తారా ?
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ ముఖ్యనేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారలో లేదో చెప్పాలంటూ దానం నాగేందర్కి సదరు నేతలు అల్టిమేటం జారీ చేయనునట్లు సమాచారం. అందులోభాగంగా గురువారం గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఆ భేటీలో దానం తీరుపై నేతలు చర్చించనున్నారు. తన వైఖరిపై దానం వివరణ ఇవ్వకుంటే నగర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని టీపీసీసీ నేతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ అన్ని తానై నడపాల్సి ఉంది. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాల పట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలే పునరావృతమైతే పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దానం వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు అందినట్లు సమాచారం. -
దానంను తప్పిస్తారా ?
-
వరంగల్ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదు
-
వరంగల్ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదు : సర్వే
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలను మానిప్లేట్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.... ఎన్నికల ప్రచారం సందర్బంగా టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత కనిపించిందని ఆయన గుర్తు చేశారు. అందులోభాగంగా ఆ పార్టీ మంత్రులు, నేతలను ప్రజలు నిలదీశారని అన్నారు. ఈవీఎంల మానిప్లేట్పై ప్రత్యేక కమిషన్‌తో బహిరంగ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వే సత్యనారయణ డిమాండ్ చేశారు. ఈవీఎంలు కరెక్ట్ అని తేలితే కేసీఆర్‌కి సలాం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంలు మానిప్లేట్ అయ్యాయని తేలితే కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నుంచే... టీఆర్ఎస్ ఈవీఎంల మానిప్లేట్ చేయడం ప్రారంభించిందన్నారు. ప్రచారంలో కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. ఉద్యమ కాలంలోనూ టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రాలేదని తెలిపారు. వరంగల్‌లో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రావడం.. కాంగ్రెస్‌కి డిపాజిట్ రాకపోవడానికి కారణం ఈవీఎంలు మానిప్లేట్ చేయడమే అని సర్వే స్పష్టం చేశారు. -
'బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోంది'
హైదరాబాద్ : భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ప్రతిష్టను తగ్గించేందుకు కుట్ర జరగుతోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. జైపాల్‌రెడ్డి ఆరోపించారు. నెహ్రు సిద్ధాంత స్ఫూర్తి దేశానికే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో నెహ్రు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ... అధికారంలో ఉన్న ఏ ప్రధాని అయినా నెహ్రు బాటలోనే పయనించాలన్నారు. గురువారం లండన్‌లో కూడా నరేంద్ర మోదీ అదే స్ఫూర్తిలో మాట్లాడారని ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి గుర్తు చేశారు. నవభారత నిర్మాణానికి ఆధ్యుడు, బాధ్యుడు నెహ్రునే అని చెప్పారు. నెహ్రు ఫొటో లేకుండా బాలల దినోత్సవం నిర్వహించడం ఆరెస్సెస్‌కే చెల్లిందన్నారు. బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోందని జైపాల్‌రెడ్డి విమర్శించారు. -
'కేసీఆర్ దూకుడు తగ్గించాలి'
-
'కేసీఆర్ దూకుడు తగ్గించాలి'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) శుక్రవారం హైదరాబాద్‌లో వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి, విద్యుత్ అంశాల్లో సీఎం కేసీఆర్ విధానాలు పర్వాలేదన్నారు. కేసీఆర్ చేసిన మంచి పనులు స్వాగతించాలని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెస్సార్ సూచించారు. ఇతర పార్టీల మాదిరే కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారన్నారు. దూకుడు తగ్గించి అందరినీ కలుపుకుని పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హితవు పలికారు. ఎవరికి ఓటేయాలనేది వరంగల్ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. బిహార్‌లో మాదిరిగానే వరంగల్ ప్రజలు కూడా ఫలితాన్నిస్తారని ఎమ్మెస్సార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ పాలన సరిగా లేదని బిహార్ ప్రజలు నిరూపించారన్నారు. లోపాలు సరిచేసుకోవడానికి బీజేపీకి బిహార్ ఫలితాలు అనుకూలిస్తాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రాహుల్ ఓపిక పట్టాలన్నారు. -
'కేసీఆర్‌కి పరాభవం తప్పదు'
వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ జైపాల్‌రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం వరంగల్‌లో జైపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌ది అహంకార పాలన అని ఆయన అభివర్ణించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించి.. దళితులను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. 16 నెలల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం అయినట్లే... తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కూడా వరంగల్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమతమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి వరంగల్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. -
రేపటి బంద్ విఫలం చేసేందుకు ప్రయత్నం
హైదరాబాద్ : ఆశా వర్కర్లు పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ఆశావర్కర్ల అరెస్ట్ కేసీఆర్ సర్కార్ నిరంకుశత్వానికి నిదర్శనం అని అభివర్ణించారు. సమస్యలపై పోరాడుతున్న వారిని అణిచివేయడం సరికాదని కేసీఆర్ ప్రభుత్వానికి పొన్నం సూచించారు. రైతులు, ఆశావర్కర్లు ఆందోళనలో ఉంటే ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు జరపడం సరికాదని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ బంద్ విఫలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పొన్నం విమర్శించారు. -
తలసాని భూకబ్జాలను ఆపాలి..
హైదరాబాద్: సనత్‌నగర్ జెక్ కాలనీలో ఓ వర్గానికి చెందిన వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసుకోమని సదరు కాలనీ వాసులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మర్రి శశిధర్‌రెడ్డి విలేకర్ల తో మాట్లాడుతూ... మంత్రిగా ఉండి వక్ఫ్ భూమిని కబ్జా చేసుకోమనడం చట్ట విరుద్దమన్నారు. తలసానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. తలసాని చర్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. భూ కబ్జా చేసినట్లైతే హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తలసాని భూ కబ్జాను ఆపాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. -
వరంగల్ జిల్లాపై సీఎం కక్ష గట్టారు : గండ్ర
వరంగల్ : వరంగల్ జిల్లాపై సీఎం కేసీఆర్ కక్ష గట్టారని ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకటరమణ అన్నారు. ఆదివారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పిట్టకథలు చెప్పడంలో దిట్ట అని విమర్శించారు. 15 నెలల పాలనలో దేవాదుల ప్రాజెక్టుపై రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. దేవాదుల మూడో దశకు నిధులు విడుదల చేయాలని గండ్ర ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కంతానపల్లి ప్రాజెక్టుతోపాటు జిల్లాలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని కోరారు. అలాగే భూపాలపల్లి జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
మర్రి... వర్రీ అవుతున్నారు..
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ ఏదీ అని పాలబుగ్గల పసివాడిని అడిగినా... కాంగ్రెస్ పార్టీ అంటూ ఠకీమని జవాబు చెబుతాడు. అలాంటి పార్టీలో ఓ నాయకుడికి ఢిల్లీలో కాదు గల్లీలో పదవి వస్తే ఎలా చెలరేగుతాడో ఇట్టే ఊహించుకోవచ్చు. కానీ అటువంటి పార్టీలో అలాంటి ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ కాదు తండ్రిముఖ్యమంత్రి గానే కాక పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పని చేశారు. ఒకానొక దశలో హస్తం పార్టీ అధిష్టానం కూడా ఈయన తండ్రిగారితో మీరు ఎంతంటే అంతా అనేది. అలాంటి వారసత్వం నుంచి వచ్చిన నేత మాత్రం మాంచీ ఊపు ఉత్సాహంతో ఉండకుండా సాదా సీదాగా ఉంటూ...తెలుగు రాష్ట్రాలలో ఆయనంతటి కామ్ గోయింగ్ పర్సన్ మరొకరు లేనట్లు వ్యవహరించే వారు. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షంలోని వారినే కాదు స్వపక్షంలోని వారిని కూడా పల్లెత్తి మాట మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పటికే గుర్తు వచ్చిఉంటుంది ఆయనేవరో.. మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి. అయితే 2014 ఎన్నికల్లో సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి (అప్పటి) తలసాని శ్రీనివాసయాదవ్ చేతితో ఓటమి పాలైయ్యారు. గెలుపోటములు సహాజమే. కానీ పక్క నియోజకవర్గం నుంచి వచ్చి తనపై పోటీ చేసి గెలిచిన తలసాని అప్పటి వరకు రింగరింగా అంటూ తిరిగిన రెండు చక్రాల సైకిల్‌కు గుడ్ బై చెప్పి నాలుగు చక్రాల కారెక్కి... కేసీఆర్ మంత్రి వర్గంలో కీలక శాఖను కొట్టేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డికి వర్రీ మొదలైంది. తలసాని రాజీనామా ఆమోదించకుండా ఎలా మంత్రి పదవిలో కూర్చోబెడతారంటూ స్పీకర్, కేసీఆర్‌పై మండిపడ్డారు. ఇక రాష్ట్ర గవర్నర్‌పై... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ నిప్పులు చెరిగారు. ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు గవర్నర్‌పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. నోట్లో నాలుక లేనట్లు ఉండే మర్రి శశిధర్ రెడ్డి ఇలా మాట్లాడటం చూసి అన్ని పార్టీల నేతలు నిశ్చేష్టులవుతున్నారు. టీటీడీపీ నేతలైతే మనపని కూడా ఆయనగారే చేస్తున్నారని మహాదానంద పడ్డారు. తలసాని రాజీనామాను ఆమోదిస్తే సనత్‌నగర్ ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి తన సత్తా చాటుకునేందుకు ఆయనగారు ఇంతగా వర్రీ అవుతున్నారని నేతలంతా తమలోతాము గుసగుసలాడుకుంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఐదుసార్లు పోటీ చేయగా మూడు సార్లే గెలిచారు. ఓ వేళ తలసాని రాజీనామా ఆమోదం పొంది...ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగినా... మర్రిని గెలిపిస్తారా లేదా.. తలసానికే ఆ సీటు కట్టబెడతారా అనేది ఆ నియోజకవర్గ ప్రజలే చెప్పాలి. -
అసెంబ్లీకి సేవ చేయడానికి వచ్చారా ? లేక ...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశానని చెప్పి అందరినీ మోసం చేశారని శాసన మండలిలోని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాలయంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. అంతేకాకుండా తలసాని రాజ్యాంగ వ్యవస్థను తప్పుదోవపట్టించారని విమర్శించారు. అసెంబ్లీకి సేవ చేయడానికి వచ్చారా ? లేక మోసం చేయడానికి వచ్చారా అంటూ తలసానిని షబ్బీర్ అలీ సూటిగా ప్రశ్నించారు. తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలని... అలాగే కేసీఆర్ కేబినెట్ నుంచి వెంటనే తలసానిని బర్తరఫ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో లేదో తెలుసుకోకుండా గవర్నర్ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి తప్పు చేశారన్నారు. నైతికత ఉంటే గవర్నర్ కూడా రాజీనామా చేయాలన్నారు. ఈ అంశంపై స్పీకర్ కూడా స్పందించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆదర్శపాలన అంటే ఈ విధంగా మోసం చేసి పదవులను అనుభవించటమేనా అని కేసీఆర్ ప్రభుత్వంలోని పెద్దలను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతారని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యే పదవికి తలసాని అసలు రాజీనామా చేయలేదు
హైదరాబాద్: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే పదవికి తలసాని అసలు రాజీనామానే చేయలేదని మండిపడ్డారు. ఆర్టీఐ చట్టం కింద అసెంబ్లీ సచివాలయం ఈ వాస్తవాన్ని వెల్లడించిందని ఆయన తెలిపారు. తలసాని రాజీనామా లేఖ తమకు అందలేదంటూ స్పీకర్ కార్యాలయం ఇచ్చిన లేఖను సోమవారం రాష్ట్ర గవర్నర్‌కు సమర్పిస్తామన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తలసాని శ్రీనివాసయాదవ్ గవర్నర్, సీఎంకు చెప్పి మంత్రిగా ప్రమాణం చేసి... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తక్షణమే గవర్నర్... కేసీఆర్‌ను పిలిపించి తలసానిచే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపాలని ఆయన తలసానికి సూచించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తలసాని నిస్సిగ్గుగా రాజకీయ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. తనది ఆదర్శపాలన అని చెబుతున్న సీఎం కేసీఆర్.. తలసాని నిర్వాకంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్, సీఎం, గవర్నర్‌ను మోసం చేసిన తలసానిపై డీజీపీ సుమోటోగా కేసు పెట్టాలని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. -
'మైనార్టీలను వర్గాలుగా విభజిస్తున్న ప్రభుత్వం'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలపై అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో పొన్నం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బీసీలకు సంక్షేమ పథకాలు సరిగ్గా అందడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వర్గాలుగా విభజించి పాలిస్తోందని విమర్శించారు. వాటి నిధుల కేటాయింపు, జీవోల జారీ, వాటి అమలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆయనగారికి 'అలకలు అలవాటే'
(వెబ్సైట్ ప్రత్యేకం) టికెట్ ఇవ్వలేదంటే అలక పాన్పు ఎక్కడం ఆయనకు అలవాటే. అలకబూనటం, ఆ తర్వాత ఆయనగారిని బుజ్జగించటం మామూలే. పార్టీ సీనియర్ నాయకులు వచ్చి కొద్దిగా సోప్ వేస్తే చాలు ఇలా ఐస్ అయిపోతారు. ఆయనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్. 2004లో ఆయన గారు ఆసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే ఆ స్థానాన్ని మరొకరికి అధిష్టానం కేటాయించింది. ఆయనకు మాత్రం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం ఇచ్చింది. దాంతో పార్టీ హైకమాండ్ మీద అలక బూనారు. మీరు వద్దు మీ టిక్కెట్ వద్దు అంటూ హస్తం పార్టీకి బై బై చెప్పి.. టీడీపీ సైకిల్ ఎక్కేశారు. తీరా ఎన్నికలు జరిగి... అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అదికాక సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి ఆయన తప్పుకోవడంతో ఆ టిక్కెట్ అంజన్ కుమార్ యాదవ్ దక్కించుకుని... నేరుగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. దాంతో దానం తన దురదృష్టాన్ని తానే నిందించుకున్నారు. హస్తాన్ని వీడి 'సైకిల్'పై ప్రయాణం చేసేందుకు సతమతం అయిన ఆయన కొద్దిరోజులకే పచ్చ పార్టీకి కనీసం గుడ్ బై చెప్పకుండా హస్తం పట్టేసుకుని స్వంత గూటికి వచ్చేసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీకి ఎన్నికై మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తదితర పరిణామాల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలనే గెలుచుకుంటే... హైదరాబాద్‌లో మాత్రం 'చేతి'పార్టీ చతికిలపడింది. నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా అధికారం ఉంటేనే కానీ హవా సాగదాయే అనే విషయం అర్థమైన దానం నాగేందర్ కన్ను ఎమ్మెల్సీపై పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరుణం రానే వచ్చింది. తాను ఆశించిన ఎమ్మెల్సీ సీటును నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ ఆకుల లలితకు ఇవ్వడంపై ఆయన అవాక్కయ్యారు. అసలే గ్రేటర్ ఎన్నికలు తుపాకీ వదిలిన బుల్లెటూలా దూసుకు వస్తుంటే ఎవరికో టిక్కెట్ ఇవ్వడం ఏమిటని దానం మళ్లీ అలక పాన్పు ఎక్కేశారు. ఈ ఎన్నికల్లో ఐదో ఎమ్మెల్సీని కూడా తమ కారులో ఎక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహారచన చేస్తుంది. ఈ నేపథ్యంలో నిలబెట్టిన ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థంగా మారుతుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ దూతలను రంగంలోకి దింపింది. పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవి తదితర నేతలంతా హైదరాబాద్‌లో మకాం వేసి... దానంను అలక పాన్పు నుంచి దించి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునే పనిలో పడ్డారు. -
'రాష్ట్రం కోసమే చనిపోయారని టీఆర్ఎస్ కండువాలు కప్పారు'
నిజామాబాద్: రాష్ట్రంలో ఎవరు చనిపోయినా తెలంగాణ కోసమే చనిపోయారని టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ కండువాలు కప్పారని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని రైతు ఆత్మహత్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై కేంద్రానికి నివేదికలు ఇవ్వొచ్చు కదా అంటూ ఆయన బీజేపీ నేతలకు సూచించారు. మూడేళ్ల వరకు విద్యుత్ సాధ్యం కాదని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తుంటే రైతులకు ధైర్యం ఎలా వస్తుందని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. -
కేసీఆర్ మహాత్ముడా ?
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ మహాత్ముడు అంటూ టీఆర్ఎస్ ప్లీనరీలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పొగడ్తలతో ముంచెత్తడంపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో గాంధీ భవన్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేసీఆర్‌ను మహాత్ముడు అని ఎందుకు పొగిడారంటూ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని ప్రశ్నించారు. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసినందుకు గాంధీజీని మహాత్ముడు అని మనమంతా కీర్తించుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. కానీ దళితుడినే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పి... దళితులకు దక్కాల్సిన సీఎం కుర్చీని కబ్జా చేసినందుకు మహాత్మా అని పొగుడుతున్నారా? రాష్ట్ర మంత్రివర్గంలోని కీలక పదవులన్నీ కుటుంబసభ్యులకే కట్టబెట్టినందుకు మహాత్మా అంటున్నారా? .. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహ్మమద్ అలీ షబ్బీర్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను మహాత్మా అంటూ నిజమైన మహాత్ములను అవమానిస్తున్నారని విమర్శించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని టీఆర్ఎస్ ప్లీనరీ తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆరోపించారు. అసలే కరువు, ఆపై అకాలవర్షాలతో పంట నష్టపోయి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ప్లీనరీలో హామీ వస్తుందని ఆశించినామన్నారు. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి కనీస ప్రస్తావన కూడా లేకుండా ప్లీనరీని పొగడ్తలతో ముగించారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్రంలో 939 రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటే ప్లీనరీలో ఫైవ్‌స్టార్ హోటళ్లలోని మెనూతో ప్లీనరీ నిర్వహించుకున్నారని అన్నారు. ఆత్మహత్యలను పట్టించుకోకుండా చికెన్లు, మటన్లు, నాటుకోళ్లు, తలకాయ కూర, బోఠీ ఫ్రై వంటి విలాసాలతో సభ పెట్టుకుని రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉందని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ చేసిన లెక్కలేనన్ని వాగ్దానాల చేసి... వాటిని అమలు చేయకుండా వెనక్కి తగ్గారన్నారు. ప్లీనరీలో చెప్పిన మాటలు కూడా నమ్మలేమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాల అమలుపైనా ప్లీనరీలో ప్రస్తావించలేదన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్క విద్యుత్ప్లాంటుకు కూడా శంకుస్థాపన చేయలేదని... తెలంగాణ ఏర్పాటు చేసిన ఘనతతోపాటు తెలంగాణలో కరెంటు సరఫరా ఘనత పూర్తిగా కాంగ్రెస్ పార్టీదే అని ఆయన తెలిపారు. వాటర్‌గ్రిడ్‌లో అవినీతికి సంబంధించిన ప్రశ్నలకు, రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీకోసం డిమాండు చేసినా సీఎం కేసీర్ ప్లీనరీలోనూ సమాధానం చెప్పలేదని షబ్బీర్ అలీ విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై మానవహక్కుల సంఘం తప్పుబట్టినా ప్రభుత్వ తీరులో మార్పురాకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న ద్రోహులను మంత్రివర్గంలో చేరినవారి ధోరణి, కేసీఆర్ కుటుంబసభ్యుల తీరుతో తెలంగాణ కోసం నిజంగా త్యాగాలు చేసినవారి కుటుంబాలు తీవ్ర క్షోభకు గురవుతున్నాయని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. -
'ఆయన విదేశాల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు'
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ దేశంలో కంటే విదేశాల్లో ఎక్కవ కాలం గడుపుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... దేశంలోని నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రధాని మోదీ శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. స్వచ్ఛభారత్, గ్రామాల దత్తత వంటి కార్యక్రమాలు చేపట్టడం తప్ప... ఎన్నికల హామీలను మోదీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలు, పీడీపీతో పొత్తు, మన్మోహన్ సింగ్‌పై విచారణ వంటి అంశాలతో మోదీ గ్రాఫ్ పడిపోయిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
'టి.కాంగ్రెస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు'
హైదరాబాద్ : టి.కాంగ్రెస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టివిక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ... పొన్నాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ముద్ర పడిందని గుర్తు చేశారు. పొన్నాలను తొలగించాలని కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి చెప్పారని ఆరోపించారు. 2019 నాటి వరకు ఉత్తమ్ నాయకత్వాన్నే కొనసాగించాలని ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, డీఎస్‌లు మాట్లాడుతూ... యువనాయకత్వానికి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పచెప్పిందని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఉత్తమ్, భట్టి విక్రమార్కలకు సహకరించాలని నేతలందరికి జైపాల్‌రెడ్డి, డీఎస్ విజ్ఞప్తి చేశారు. -
'చంద్రబాబుపై టీటీడీపీ నేతలు తిరగబడాలి'
హైదరాబాద్: నాగార్జునసాగర్ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రెండో పంటకు నీళ్లు రాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బాబుపై తిరగబడాలని ఆయన తెలంగాణలోని ఆ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. సాగర్ ఎడమ కాలువ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల చెరువులను నింపైనా రెండో పంటకు నీళ్లు ఇచ్చేలా తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూతో జనాలు మరణిస్తుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.