'చంద్రబాబుపై టీటీడీపీ నేతలు తిరగబడాలి' | Komatireddy venkat reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుపై టీటీడీపీ నేతలు తిరగబడాలి'

Published Wed, Jan 7 2015 2:26 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

'చంద్రబాబుపై టీటీడీపీ నేతలు తిరగబడాలి' - Sakshi

'చంద్రబాబుపై టీటీడీపీ నేతలు తిరగబడాలి'

హైదరాబాద్: నాగార్జునసాగర్ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రెండో పంటకు నీళ్లు రాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బాబుపై తిరగబడాలని ఆయన తెలంగాణలోని ఆ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.

సాగర్ ఎడమ కాలువ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల చెరువులను నింపైనా రెండో పంటకు నీళ్లు ఇచ్చేలా తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూతో జనాలు మరణిస్తుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement