గవర్నర్ సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్ భేటీ | chandrababu naidu, kcr meets governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్ భేటీ

Published Sat, Feb 14 2015 10:20 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM

chandrababu naidu, kcr meets governor narasimhan

హైదరాబాద్ : నాగార్జున సాగర్ నీటి విడుదల పంచాయితీ ...గవర్నర్ నరసింహన్ వద్దకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ శనివారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమతో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ జలవివాదంపై చర్చిస్తున్నారు.


నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద శుక్రవారం ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.  ఈ ఘర్షణపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. కాగా ఈ జల వివాదంపై కేంద్రం ఆరా తీసినట్లు సమాచారం. సాగర్ వద్ద ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర హోంశాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర అధికారులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement