గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది.
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. నాగార్జున సాగర్ జల వివాదంపై గవర్నర్ ...ముఖ్యమంత్రుల చర్చించారు. ఈ విషయంపై ఒక పరిష్కారానికి రావాలని కేసీఆర్, చంద్రబాబుకు గవర్నర్ సూచించినట్లు సమాచారం. కాగా సాగర్ వద్ద కేంద్ర బలగాలు మోహరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్లు సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం అడిగినన్ని నీళ్లు ఇవ్వలేమని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.