'కేసీఆర్ దూకుడు తగ్గించాలి' | kcr's administration good, says M Satyanarayana rao | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ దూకుడు తగ్గించాలి'

Published Fri, Nov 13 2015 1:46 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'కేసీఆర్ దూకుడు తగ్గించాలి' - Sakshi

'కేసీఆర్ దూకుడు తగ్గించాలి'

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) శుక్రవారం హైదరాబాద్లో వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి, విద్యుత్ అంశాల్లో సీఎం కేసీఆర్ విధానాలు పర్వాలేదన్నారు. కేసీఆర్ చేసిన మంచి పనులు స్వాగతించాలని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెస్సార్ సూచించారు. ఇతర పార్టీల మాదిరే కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ను విమర్శిస్తున్నారన్నారు. 

దూకుడు తగ్గించి అందరినీ కలుపుకుని పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కి హితవు పలికారు. ఎవరికి ఓటేయాలనేది వరంగల్ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. బిహార్లో మాదిరిగానే వరంగల్ ప్రజలు కూడా ఫలితాన్నిస్తారని ఎమ్మెస్సార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ పాలన సరిగా లేదని బిహార్ ప్రజలు నిరూపించారన్నారు. లోపాలు సరిచేసుకోవడానికి బీజేపీకి బిహార్ ఫలితాలు అనుకూలిస్తాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రాహుల్ ఓపిక పట్టాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement