
'రాష్ట్రం కోసమే చనిపోయారని టీఆర్ఎస్ కండువాలు కప్పారు'
నిజామాబాద్: రాష్ట్రంలో ఎవరు చనిపోయినా తెలంగాణ కోసమే చనిపోయారని టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ కండువాలు కప్పారని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గురువారం నిజామాబాద్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని రైతు ఆత్మహత్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు.
రైతుల ఆత్మహత్యలపై కేంద్రానికి నివేదికలు ఇవ్వొచ్చు కదా అంటూ ఆయన బీజేపీ నేతలకు సూచించారు. మూడేళ్ల వరకు విద్యుత్ సాధ్యం కాదని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తుంటే రైతులకు ధైర్యం ఎలా వస్తుందని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.