'కేసీఆర్ ఒక్క గజ్వేల్కే ముఖ్యమంత్రా?' | KCR CM for only Medak or Entire Telangana, questioned congress mla jeevan reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఒక్క గజ్వేల్కే ముఖ్యమంత్రా?'

Published Sun, Aug 7 2016 4:26 AM | Last Updated on Fri, Aug 24 2018 1:52 PM

'కేసీఆర్ ఒక్క గజ్వేల్కే ముఖ్యమంత్రా?' - Sakshi

'కేసీఆర్ ఒక్క గజ్వేల్కే ముఖ్యమంత్రా?'

హైదరాబాద్ : తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క గజ్వేల్ సీఎం కాదని, ఇతర ప్రాంతాలపైనా శ్రద్ధ వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించే పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ సుజల స్రవంతి పేరు మార్చి మిషన్ భగీరథ అని పేరు పెట్టారని వ్యాఖ్యానించారు. పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరామని పొన్నం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement