ఆ కుంభకోణంలో సీఎం పాత్రేంటి? | congress leader jeevan reddy fires on cm kcr | Sakshi
Sakshi News home page

ఆ కుంభకోణంలో సీఎం పాత్రేంటి?

Published Mon, Aug 7 2017 6:41 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

ఆ కుంభకోణంలో సీఎం పాత్రేంటి? - Sakshi

ఆ కుంభకోణంలో సీఎం పాత్రేంటి?

కరీంనగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి మండిపడ్డారు. భూముల కుంభకోణంలో సీఎం పాత్ర ఏమిటో ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. హామీలను అమలు చేయని కేసీఆర్‌, పేదలను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కరీంనగర్‌లో మాజీ ఎంపీ పొన్నప్రభాకర్‌ చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన పలువురు నేతలతో కలిసి సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయలకతీతంగా అన్ని పార్టీలు పొన్నం దీక్షకు మద్దతు తెలుపుతున్నా, ప్రభుత్వం మాత్రం ప్రభాకర్ పై కేసులు పెట్టిందని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్‌కు కేసులు, జైళ్లు కొత్తవేం కాదని తెలిపారు. దీక్ష ప్రారంభించి మూడు రోజులైనా ప్రభుత్వ స్పందన లేకపోవడం దారుణమన్నారు. రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్‌ను సీఎం కేసీఆర్‌ విస్మరించారన్నారు. కరీంనగర్ కేంద్రంగా 500 పడకల ఆసుపత్రి ఉండగా మెడికల్ కళాశాల ఎందుకు ప్రకటించరని నిలదీశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement