రేపటి బంద్ విఫలం చేసేందుకు ప్రయత్నం
హైదరాబాద్ : ఆశా వర్కర్లు పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ఆశావర్కర్ల అరెస్ట్ కేసీఆర్ సర్కార్ నిరంకుశత్వానికి నిదర్శనం అని అభివర్ణించారు. సమస్యలపై పోరాడుతున్న వారిని అణిచివేయడం సరికాదని కేసీఆర్ ప్రభుత్వానికి పొన్నం సూచించారు.
రైతులు, ఆశావర్కర్లు ఆందోళనలో ఉంటే ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు జరపడం సరికాదని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ బంద్ విఫలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పొన్నం విమర్శించారు.