M Satyanarayana Rao
-
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు అరుదైన ఫోటోలు
-
ఎమ్మెస్సార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
-
ఎమ్మెస్సార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎం.సత్యనారాయణరావుకు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా ఎమ్మెస్సార్ పనిచేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం. ఎమ్మెస్సార్ మృతితో వెదిర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిగ్భ్రాంతి.. విజయవాడ: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ పాదయాత్రలో ఎమ్మెస్సార్ వెన్నంటే ఉన్నారని మల్లాది విష్ణు అన్నారు. చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత కోవిడ్ కట్టడికి త్రిముఖ వ్యూహం -
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్ తుదిశ్వాస విడిచినట్లు ఆయనకు వైద్యం అందించిన వైద్యులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం. ఆయన మృతితో వెదిర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్లో ఎమ్మెస్సార్ మంత్రిగా పనిచేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎమ్మెస్సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెస్సార్ విసిరిన సవాల్‌తో 2006లో తొలిసారి తెలంగాణ కోసం కేసిఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎమ్మెస్సార్ సహకరించారు. ► ఎమ్మెస్సార్ మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను అదేశించారు. ► ఎమ్మెస్సార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీఎం జగన్ తెలియజేశారు. చదవండి: కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..? -
'కేసీఆర్ దూకుడు తగ్గించాలి'
-
'కేసీఆర్ దూకుడు తగ్గించాలి'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) శుక్రవారం హైదరాబాద్‌లో వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి, విద్యుత్ అంశాల్లో సీఎం కేసీఆర్ విధానాలు పర్వాలేదన్నారు. కేసీఆర్ చేసిన మంచి పనులు స్వాగతించాలని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెస్సార్ సూచించారు. ఇతర పార్టీల మాదిరే కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారన్నారు. దూకుడు తగ్గించి అందరినీ కలుపుకుని పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హితవు పలికారు. ఎవరికి ఓటేయాలనేది వరంగల్ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. బిహార్‌లో మాదిరిగానే వరంగల్ ప్రజలు కూడా ఫలితాన్నిస్తారని ఎమ్మెస్సార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ పాలన సరిగా లేదని బిహార్ ప్రజలు నిరూపించారన్నారు. లోపాలు సరిచేసుకోవడానికి బీజేపీకి బిహార్ ఫలితాలు అనుకూలిస్తాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రాహుల్ ఓపిక పట్టాలన్నారు. -
'అదృష్టం లేదు ... గవర్నర్ గిరి రాలేదు'
హైదరాబాద్: హైదరాబాద్: తానకు అదృష్టం లేక గవర్నర్ పదవి వరించలేదని నాటి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెస్సార్ జన్మదిన వేడుకలు ఘనం జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ....తనకు గవర్నర్ పదవి ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎంతగానో ప్రయత్నించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే సాధ్యమైందని ఆయన చెప్పారు. లేకుంటే బ్రహ్మదేవుడు దిగి వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యేది కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన... ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించలేకపోయామన్నారు. అలాగే కార్యకర్తలను సమన్వయం చేయడంలో కూడా పార్టీ విఫలమైందని ఎమ్మెస్సార్ వెల్లడించారు. దేశంలో, రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని ఎమ్మెస్సార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ నేతలు ఐక్యంగా కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేని ఎమ్మెస్సార్ స్పష్టం చేశారు. -
నిర్మొహమాటం... నిండైన వ్యక్తిత్వం
లౌక్యం, చతురత ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకునే వాగ్దానాలు చేసే నాయకులే సర్వసాధారణమైన రాజ కీయాల్లో... ఉన్నది ఉన్నట్టుగా నిర్మొహమాటంగా వ్యాఖ్యానించడం, ముక్కుకు సూటిగా వ్యవహరించడం అరుదు. అలాంటి అరుదైన నేతే, ఎంఎస్ఆర్గా సుప్రసిద్ధులైన ఎం. సత్యనారాయణరావు. 82 ఏళ్ల క్రితం కరీంనగర్‌కు దగ్గరలోని వెదిర గ్రామంలో ఆయన జన్మిం చారు. చిన్నప్పటి నుంచి పది మందితో అన్యోన్యంగా ఉండటం, సంభాషించడం ఆయనకు అలవాటు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంటే విపరీతమైన అభిమానం. 1954 నుండి ఆయన యువజన కాంగ్రెస్ కార్యకలాపాల్లో పనిచేశారు. వి.పురుషోత్తమ్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కె.రామిరెడ్డి వంటి నాయకులతో సత్సంబంధాలుండేవి. విద్యానంతరం కరీంనగర్లో న్యాయవాద వృత్తి చేపట్టారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెస్సార్ చురుగ్గా పాల్గొని, జైలు శిక్ష కూడా అనుభవించారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీ చేసి గెలి చారు. అప్పటి నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని ఆయన ఎస్. బి.గిరితో కలిసి తీవ్రంగా వ్యతిరేకించారు. లోక్‌సభలోనే ఆయన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. అయినా ఇందిరాగాంధీ కుట్రలు, కుతంత్రాలు ఎరుగని ఎమ్మెస్సార్‌ను అభిమానించి ఆయనను అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1977లో కాంగ్రెస్ ఓటమిపాలై, 1978లో చీలిపోయినప్పుడు ఆయన నిర్ద్వంద్వంగా ఇందిరను బలపరిచారు. అఖిల భారత కాంగ్రెస్ కార్యద ర్శిగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణా టక, కేరళ, తమిళనాడు, గోవా రాష్ట్రా ల్లో పార్టీని పర్యవేక్షించారు. ఆంధ్రప్ర దేశ్‌లో మర్రి చెన్నారెడ్డి తర్వాత టి. అంజయ్యను ముఖ్య మంత్రిని చేయడానికి ఆయనెంతో కృషిచేశారు. రాజీవ్ గాంధీ ఏపీ పర్యటన సందర్భంగా అంజయ్యతో అనుస రించిన వైఖరి అనుచితమని ఇందిరాగాంధీకి నిర్మొహ మాటంగా నివేదించారు. అది గిట్టని రాజీవ్‌గాంధీ 1984లో ఆయనకు లోక్‌సభ టికెట్ దక్కనియ్యలేదు. అయినా ఆయన పార్టీని వీడలేదు, నాయకత్వాన్ని విమ ర్శించలేదు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆయన సోనియాగాంధీ అనుయాయిగా ఉన్నారు. 2000లో సోనియా ఎమ్మెస్సార్‌ను ఏపీపీసీసీ అధ్యక్షునిగా నియ మించారు. ఆ పదవిలో ఉన్న మూడేళ్లు ఆయనకు రాజకీయంగా అత్యంత తృప్తినిచ్చిన కాలం. 2004 శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్లో విజయం సాధించి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా చేరారు. 1990లో మొదటిసారి రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ అధ్యక్షులుగా పద వీ స్వీకారం చేసిన తర్వాత దఫాలుగా ఆయన మొత్తం దాదాపు 20 ఏళ్లు ఆ పదవిని నిర్వహించారు. అనారోగ్యం వల్ల గత కొద్దికాలంగా ఎమ్మెస్సార్ రాజకీయాల్లో చురుగ్గా లేరు. అయినా ఇప్పటికీ ఆయన జ్ఞాపకశక్తి చెక్కుచెదరలేదు. ఎమ్మెస్సార్‌తో పరిచయం ఉన్న ప్రతివారూ గుర్తుపెట్టుకునేది ఆయన నిష్కల్మష త్వం, నిర్మొహమాటత్వం. రాజకీయాలలో ఆయన బల హీనత, బలం కూడా అవే. ఏ పదవిలో ఉన్నప్పటికీ ఎన్నడూ అవినీతి ఆరోపణలు ఎరుగని అరుదైన నిష్కళంక రాజకీయ నేత. సహస్ర చంద్ర దర్శనం (82 ఏళ్లు) చేసుకుంటున్న ఎం. సత్యనారాయణరావుకు శుభాకాంక్షలు, శుభకామనలు. (ఎమ్మెస్సార్ సహస్ర చంద్ర దర్శనం సందర్భంగా) -చెన్నమనేని రాజేశ్వరరావు సీనియర్ జర్నలిస్టు -
గవర్నర్ అవుతాననుకుంటున్నా: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఖాయమని మాజీ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణరావు అన్నారు. 1969లో తాము చేసిన పోరాట ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడుతోందన్నారు. రాష్ట్ర విభజన అంశం భావోద్వేగమైందని తెలిపారు. సీమాంధ్రలో ఓట్ల కోసమే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర అంటున్నారని చెప్పారు. ఆయన బాధ ఆయనిదన్నారు. తెలంగాణ సీఎం పదవిని తాను కోరుకోవడం లేదని చెప్పారు. గతంలో గవర్నర్ పదవి ఇస్తామని తనకు సోనియా గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. గవర్నర్ పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. -
పాపం చేసి ఉంటేనే పూజలకు వస్తారు: ఎమ్మెస్సార్
శ్రీకాళహస్తి: పాపం చేసినవాళ్లు విముక్తి కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకుంటారని, తాను ఏదో పాపం చేసి ఉంటేనే పూజల కోసం వచ్చానని ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ రావు అన్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయానికి గురువారం ఆయన కుటుంబ సమేతంగా విచ్చేశారు. రూ.2500ల రాహుకేతు పూజలు చేయించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెస్సార్ ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ పాపం చేసిన వారికి శివయ్య తన చెంత రాహుకేతు పూజలు చేయించుకుని విముక్తి కలిగిస్తాడని, తనకా అదృష్టం ఇప్పడు లభించిందన్నారు.