'అదృష్టం లేదు ... గవర్నర్ గిరి రాలేదు'
హైదరాబాద్: హైదరాబాద్: తానకు అదృష్టం లేక గవర్నర్ పదవి వరించలేదని నాటి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఎమ్మెస్సార్ జన్మదిన వేడుకలు ఘనం జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ....తనకు గవర్నర్ పదవి ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఎంతగానో ప్రయత్నించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే సాధ్యమైందని ఆయన చెప్పారు. లేకుంటే బ్రహ్మదేవుడు దిగి వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యేది కాదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన... ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించలేకపోయామన్నారు. అలాగే కార్యకర్తలను సమన్వయం చేయడంలో కూడా పార్టీ విఫలమైందని ఎమ్మెస్సార్ వెల్లడించారు. దేశంలో, రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని ఎమ్మెస్సార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ నేతలు ఐక్యంగా కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేని ఎమ్మెస్సార్ స్పష్టం చేశారు.