state governor
-
ర్యాగింగ్‌ను కఠినంగా అణిచేస్తాం: గవర్నర్
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం నాడు ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆయన రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. కాలేజీలు, యూనివర్సిటీలలో ర్యాగింగ్‌ను కఠినంగా అణిచేస్తామని ఆయనకు తెలిపారు. ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ర్యాగింగ్‌ను అరికట్టాలని విద్యాశాఖ మంత్రులతో మాట్లాడామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజీలు, యూనివర్సిటీలలో ర్యాగింగ్ జరగడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారంలో రాజ్యాంగ పరమైన సమస్య ఎదురైనప్పుడు దాన్ని అధిగమిస్తామని కేంద్ర హోం మంత్రికి నరసింహన్ చెప్పినట్లు తెలిసింది. -
'అదృష్టం లేదు ... గవర్నర్ గిరి రాలేదు'
హైదరాబాద్: హైదరాబాద్: తానకు అదృష్టం లేక గవర్నర్ పదవి వరించలేదని నాటి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెస్సార్ జన్మదిన వేడుకలు ఘనం జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ....తనకు గవర్నర్ పదవి ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎంతగానో ప్రయత్నించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే సాధ్యమైందని ఆయన చెప్పారు. లేకుంటే బ్రహ్మదేవుడు దిగి వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యేది కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన... ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించలేకపోయామన్నారు. అలాగే కార్యకర్తలను సమన్వయం చేయడంలో కూడా పార్టీ విఫలమైందని ఎమ్మెస్సార్ వెల్లడించారు. దేశంలో, రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని ఎమ్మెస్సార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ నేతలు ఐక్యంగా కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేని ఎమ్మెస్సార్ స్పష్టం చేశారు. -
సాగర్‌కు రాష్ట్ర గవర్నర్ రాక
రేపు, ఎల్లుండి ఇక్కడే... నాగార్జునసాగర్ : రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ దంపతులు నాగార్జునసాగర్ పర్యటనకు వస్తున్నారు. ఈమేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి టీఎస్ టూరిజం అభివృద్ధి సంస్థ అధికారులకు సమాచారం అందింది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ దంపతులు సాగర్‌కు చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేసి, శనివారం ఉదయాన్నే ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ప్రత్యేక లాంచీలో నాగార్జునకొండకు వెళతారు. తదనంతరం ప్రధాన విద్యుదుత్పాన కేంద్రం, శ్రీపర్వతారామం, ఎత్తిపోతల ప్రాంతాలను సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వెళతారు. గవర్నర్ రాకను పురస్కరించుకుని అధికారులు విజయవిహార్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
'రాష్ట్రంలో సమస్యలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం'
హైదరాబాద్: రైతులకు భరోసా ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో పొన్నాల లక్ష్మయ్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. అనంతరం పొన్నాల విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కరెంట్ కోతలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీపై గవర్నర్‌కు ఈ సందర్భంగా వివరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత రాష్ట్రంలో 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. సీఎం సొంత జిల్లా సొంత నియోజకవర్గంలోనే ఆత్మహత్యలు జరిగాయని ఆయన వివరించారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని వివరించారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్నందున ఏపీ నుంచి తెలంగాణకు రావాలసిన విద్యుత్ అంశంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్‌ను కోరమని చెప్పారు. అలాగే తెలంగాణలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చోరవ తీసుకునే చూడాలని... విభజన చట్టం ప్రకారం 54 శాతం విద్యుత్ తెలంగాణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసినట్లు పొన్నాల తెలిపారు. -
వీఎస్కే విశ్వవిద్యాలయంలో సంఘటనలు బాధాకరం
సాక్షి, బళ్లారి : విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ల మధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను ఎంతో బాధించాయని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వరనాయక్ అన్నారు. ఆయన గురువారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీసీ, రిజస్ట్రార్ల మధ్య నడుస్తున్న సంఘటనలు విద్యార్థుల చదువులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉన్నత విద్యావంతులుగా ఉన్న వ్యక్తులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖమంత్రితోపాటు రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. వీలైనంత త్వరలో ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలోని కార్మికుల పిల్లలకు బాగా చదువుకునేందుకు వసతి గృహాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు ప్రాంతాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేసి, కార్మికులు పిల్లల బంగారు బాట వేస్తామన్నారు. రూ.5కోట్ల వ్యయంతో వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకు బళ్లారి, రాయచూరు జిల్లాలో పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 100 కౌశల్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒక్కోదానికి దాదాపు 2 కోట్లు ఖర్చవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాధికారి బిస్వాస్, ఎస్పీ చేతన్‌సింగ్ రాథోడ్, జెడ్పీ సీఈఓ మంజునాథ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.