సాగర్‌కు రాష్ట్ర గవర్నర్ రాక
రేపు, ఎల్లుండి ఇక్కడే...
నాగార్జునసాగర్ : రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్ దంపతులు నాగార్జునసాగర్ పర్యటనకు వస్తున్నారు. ఈమేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి టీఎస్ టూరిజం అభివృద్ధి సంస్థ అధికారులకు సమాచారం అందింది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ దంపతులు సాగర్‌కు చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేసి, శనివారం ఉదయాన్నే ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ప్రత్యేక లాంచీలో నాగార్జునకొండకు వెళతారు. తదనంతరం ప్రధాన విద్యుదుత్పాన కేంద్రం, శ్రీపర్వతారామం, ఎత్తిపోతల ప్రాంతాలను సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వెళతారు. గవర్నర్ రాకను పురస్కరించుకుని అధికారులు విజయవిహార్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.