
గవర్నర్ అవుతాననుకుంటున్నా: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఖాయమని మాజీ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణరావు అన్నారు. 1969లో తాము చేసిన పోరాట ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడుతోందన్నారు. రాష్ట్ర విభజన అంశం భావోద్వేగమైందని తెలిపారు.
సీమాంధ్రలో ఓట్ల కోసమే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర అంటున్నారని చెప్పారు. ఆయన బాధ ఆయనిదన్నారు. తెలంగాణ సీఎం పదవిని తాను కోరుకోవడం లేదని చెప్పారు. గతంలో గవర్నర్ పదవి ఇస్తామని తనకు సోనియా గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. గవర్నర్ పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.