హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత షబ్బీర్ అలీ శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ సర్కార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్కు పేరు మార్చి రీడిజైన్ చేస్తామని చెప్పారు. పాత పేరుతోనే రూ. 2 వేల కోట్లు ఎందుకు రిలీజ్ చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు ఆర్థిక సాయం చేసిన కాంట్రాక్టర్ల కోసమే ఈ రూ. 2 వేల కోట్లు అని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్గా ఈ ప్రభుత్వం మారుస్తుందని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్కు రూ. 75 కోట్లు పెంచడం సమంజసం కాదని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు.