దానంను తప్పిస్తారా ? | T congress leaders ultimatum to danam nagendra | Sakshi
Sakshi News home page

దానంను తప్పిస్తారా ?

Published Wed, Dec 2 2015 3:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

దానంను తప్పిస్తారా ?

దానంను తప్పిస్తారా ?

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ ముఖ్యనేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారలో లేదో చెప్పాలంటూ దానం నాగేందర్కి సదరు నేతలు అల్టిమేటం జారీ చేయనునట్లు సమాచారం. అందులోభాగంగా  గురువారం గాంధీభవన్లో టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఆ భేటీలో దానం తీరుపై నేతలు చర్చించనున్నారు. తన వైఖరిపై దానం వివరణ ఇవ్వకుంటే నగర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని టీపీసీసీ నేతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ అన్ని తానై నడపాల్సి ఉంది. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాల పట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలే పునరావృతమైతే పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దానం వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు అందినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement