danam nagendra
-
ఖైరతబాద్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చెసిన దానం
-
‘కబ్జాకోరునని నిరూపిస్తే రాజకీయాల్లో ఉండను’
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాలకు తాను పాల్పడినట్టుగా ఉత్తమ్కుమార్రెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. తనపై ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్కు గాంధీభవన్లో ఏ గౌరవమూ లేదని, ఢిల్లీలో డబ్బులిచ్చి పదవిని కాపాడుకుంటున్నారన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. డబ్బులకు అమ్ముడుపోయినట్టుగా తనపై వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్ కారులోనే డబ్బులు దొరికాయని.. అప్పుడు ఎవరికి అమ్ముడుపోయి డబ్బులు తెచ్చారో చెప్పాలన్నారు. -
దానంను తప్పిస్తారా ?
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ ముఖ్యనేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారలో లేదో చెప్పాలంటూ దానం నాగేందర్కి సదరు నేతలు అల్టిమేటం జారీ చేయనునట్లు సమాచారం. అందులోభాగంగా గురువారం గాంధీభవన్లో టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఆ భేటీలో దానం తీరుపై నేతలు చర్చించనున్నారు. తన వైఖరిపై దానం వివరణ ఇవ్వకుంటే నగర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని టీపీసీసీ నేతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ అన్ని తానై నడపాల్సి ఉంది. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాల పట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలే పునరావృతమైతే పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దానం వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు అందినట్లు సమాచారం. -
దానంను తప్పిస్తారా ?