క్రిమిలేయర్ కారణంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు.
హైదరాబాద్: క్రిమిలేయర్ కారణంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శుక్రవారం హైదరాబాద్లో ఆరోపించారు. ఈ అంశంపై త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలువనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌కు అధికారులు అవకాశం ఇవ్వకుంటే పార్లమెంట్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద కూర్చుని నిరసన తెలుపుతానని వీహెచ్ స్పష్టం చేశారు.
క్రిమిలేయర్ కారణంగా రాష్ట్రంలో, కేంద్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 27 శాతం రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన బీసీ సంఘాలకు సూచించారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీ, డైరెక్టర్ లేక సిలబస్ పూర్తి కాలేదని విమర్శించారు.