
తలసాని భూకబ్జాలను ఆపాలి..
హైదరాబాద్: సనత్నగర్ జెక్ కాలనీలో ఓ వర్గానికి చెందిన వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసుకోమని సదరు కాలనీ వాసులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో మర్రి శశిధర్రెడ్డి విలేకర్ల తో మాట్లాడుతూ... మంత్రిగా ఉండి వక్ఫ్ భూమిని కబ్జా చేసుకోమనడం చట్ట విరుద్దమన్నారు.
తలసానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. తలసాని చర్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. భూ కబ్జా చేసినట్లైతే హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తలసాని భూ కబ్జాను ఆపాలని సీఎం కేసీఆర్కు లేఖ రాశానని మర్రి శశిధర్రెడ్డి తెలిపారు.