'బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోంది' | S Jaipal reddy takes on BJP and RSS | Sakshi
Sakshi News home page

'బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోంది'

Published Sat, Nov 14 2015 12:10 PM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM

'బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోంది' - Sakshi

'బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోంది'

హైదరాబాద్ : భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ప్రతిష్టను తగ్గించేందుకు కుట్ర జరగుతోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. జైపాల్రెడ్డి ఆరోపించారు. నెహ్రు సిద్ధాంత స్ఫూర్తి దేశానికే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్లో నెహ్రు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లాడుతూ... అధికారంలో ఉన్న ఏ ప్రధాని అయినా నెహ్రు బాటలోనే పయనించాలన్నారు.

గురువారం లండన్లో కూడా నరేంద్ర మోదీ అదే స్ఫూర్తిలో మాట్లాడారని ఈ సందర్భంగా జైపాల్రెడ్డి గుర్తు చేశారు. నవభారత నిర్మాణానికి ఆధ్యుడు, బాధ్యుడు నెహ్రునే అని చెప్పారు. నెహ్రు ఫొటో లేకుండా బాలల దినోత్సవం నిర్వహించడం ఆరెస్సెస్కే చెల్లిందన్నారు. బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోందని జైపాల్రెడ్డి విమర్శించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement