హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇరు రాష్ట్ర పోలీసుల మధ్య ఘర్షణకు సీఎంలు చంద్రబాబు, కేసీఆరే కారణమని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మధ్య గొడవ జరిగితేనే కానీ... ఇద్దరు సీఎంలు చర్చలు జరిపేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. ఎడమ కాల్వ నుంచి నీటిని విడుదల చేయకపోతే 2.50 లక్షల ఎకరాల్లోని పంటలు ఎండిపోతాయన్నారు.
రైతులు ప్రయోజనాలు తాకట్టు పెడుతూ సెంటిమెంట్తో ఇద్దరు సీఎంలు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పంటలు ఎండిపోతే మీదే బాధ్యత అని ఇద్దరు సీఎంలదే బాధ్యత అని ఈ సందర్బంగా హెచ్చరించారు. కృష్ణా రివర్ బోర్డుకు అధికారం ఇచ్చి... ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలని గుత్తా సుఖేందర్రెడ్డి.. కేంద్రానికి సూచించారు.