'ఎమ్మెస్సార్ వృద్ధాప్యంలో ఉన్నారు'
హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి శనివారం హైదరాబాద్లో స్పందించారు. ఎమ్మెస్సార్ వ్యాఖ్యలను గుత్తా సుఖేందర్రెడ్డి తప్పపట్టారు. ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకున్నారని గుర్తు చేశారు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నారని చెప్పారు. అందువల్ల కేసీఆర్ పాలనపై ఆయనకు అవగాహన లేదన్నారు. ఈ వయస్సులో ఎమ్మెస్సార్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని గుత్తా అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందని మాజీ పీసీసీ చీఫ్ ఎమ్మెస్సార్ శుక్రవారం హైదరాబాద్ లో ప్రశంసించారు. కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు ఆరోపించినట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ పై విధంగా స్పందించారు.