MSR
-
Telangana: ఎమ్మెస్సార్ మనవడొచ్చాడు.!
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో MSR పేరు తెలియనివారు లేరు. తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఎమ్మెస్సార్ మనవడు కరీంనగర్లో అరంగేట్రం చేయబోతున్నారు. కరీంనగర్‌ను డల్లాస్‌గా మారుస్తానని చెప్పిన కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ సిటీ నాదే అంటున్న MSR మనవడి పోరాటం ఎలా ఉండబోతోందో చూద్దాం.. రోహిత్ పొలిటికల్ ఎంట్రీ కరీంనగర్ జిల్లాలో ఎం. సత్యనారాయణరావు పేరు తెలియనవారు ఉండరు. గాంధీల కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న ఎంఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. మంత్రి పదవులు అనుభవించారు. జిల్లాలో చాలా కాలం తర్వాత ఆయన వారసుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావ్ తాజాగా కరీంనగర్ సిటీ సమస్యలపై గళం ఎత్తుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఓ స్టింగ్ ఆపరేషన్ చేశారు. రెండు గంటల పాటు 15 బృందాలు డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై వీడియోలు, ఫోటోలు తీశారు. రోహిత్ రావ్ ప్రెస్ మీట్ పెట్టి తన స్టింగ్ ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. రెండు గంటల్లోనే నగరంలో 300 సమస్యలు గుర్తించామని వెల్లడించారు. స్మార్ట్ సిటీ లక్ష్యం, ఉద్దేశం నెరవేరడం లేదని విమర్శించారు. నగరపాలక సంస్థ విఫలం అయ్యిందని వేలెత్తి చూపుతూ.. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌లు దీనికి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేయబోతున్నట్లు తన కార్యక్రమాల ద్వారా రోహి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా నుంచి కరీంనగర్ ఆస్ట్రేలియాలో చదువుకున్న ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావ్ 2007 లోనే ఆస్ట్రేలియన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ అనుబంధ సంస్థను స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాతికాలంలో ఎమ్మెస్సార్ మరణంతో మనవడు రాజకీయ అరంగేట్రం కొంతకాలం ఆగింది. ప్రస్తుతం ఆయన కరీంనగర్లో ఎంట్రీ ఇచ్చి సీరియస్ రాజకీయాల్లోకి వచ్చేశారు. రాహుల్ గాంధీ వరంగల్ సభకు కేడర్ తో తరలివెళ్లారు. రాహుల్ జోడో యాత్రకు మద్దతుగా అవగాహన కల్పించేందుకు కరీంనగర్ నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. వరదల సమయంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెస్సార్ మనవడిగా రోహిత్ రావ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నా.. టికెట్ రావడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద విషయమే. కాని గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ పోటీ చేసిన లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్లో చేరడం.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం లోక్‌సభ సీటుపై ఆసక్తిగా ఉండటంతో.. ఈసారి కరీంనగర్ అసెంబ్లీ సీటు రోహిత్‌రావుకు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు వెలమ.. ఇటు పద్మశాలి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి రోహిత్ రావ్ కు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనని భావిస్తున్నారు. ఎమ్మెస్సార్‌కు పార్టీలో ఉన్న పేరు ప్రతిష్టల కారణంగా ఆయన మనవడికి కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల టైంకి టికెట్ ఆశించే వారు మరికొంత మంది ప్రత్యక్షం అవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. రోహిత్ రావ్ భార్య పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గం ఓట్లు కూడా కరీంనగర్ లో ఎక్కువే. అందువల్ల పద్మశాలి వర్గం ఓట్లు తనకే పడతాయని రోహిత్ రావ్ భావిస్తున్నారు. ఒకవైపు తన వెలమ సామాజిక వర్గం...మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఎమ్మెస్సార్ రాజకీయ వారసుడి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రూ.150 కోట్లతో... ఎంఎస్ఆర్ కాపర్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ కాపర్ పేరుతో రాగి వాటర్ బాటిళ్ల తయారీలో ఉన్న ఎంఎస్ఆర్ కాపర్ లిమిటెడ్ (గతంలో ఎంఎస్ఆర్ ఇండియా)... భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ.150 కోట్ల వ్యయంతో హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ వద్ద ఏర్పాటు చేసే ఈ ప్లాంటు తయారీ సామర్థ్యం నెలకు 600 టన్నులు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దుతున్న ఈ ఫ్యాక్టరీలో నవంబరు చివరికల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని, వైర్లు, రాగి ఉత్పత్తులు, విద్యుత్ పరికరాల వంటి 25 రకాలను ఇక్కడ తయారు చేస్తామని ఎంఎస్ఆర్ కాపర్ ఎండీ కె.వి.రాజశేఖర్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఫ్యాక్టరీకి కావాల్సిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తున్నట్టు తెలియజేశారు. నెలకు 10 లక్షల బాటిళ్లు.. ప్రస్తుతం కంపెనీ నెలకు 1.5– 2 లక్షల డాక్టర్ కాపర్ బాటిళ్లను విక్రయిస్తోంది. భారత్‌లో దక్షిణాదిన ఇవి అందుబాటులో ఉన్నాయి. యూఎస్, సింగపూర్, మలేషియా, దుబాయి, కెన్యాలో సైతం విక్రయిస్తోంది. నూతన ప్లాంటు రాకతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లకు చేరుతుంది. దీంతో కొత్త మార్కెట్లలో అడుగు పెడతామని కంపెనీ తెలిపింది. డిసెంబరు నుంచి ఉత్తరాది మార్కెట్లకు సరఫరా చేయనున్నారు. అలాగే ఆస్ట్రేలియా, యూరప్‌కు ఎగుమతి చేస్తామని, బాటిళ్ల విక్రయాల్లో ఎగుమతుల వాటా 20 శాతం ఉందని రాజశేఖర్ చెప్పారు. రెండింతల టర్నోవర్.. ఎంఎస్ఆర్ కాపర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2018–19లో రూ.250– 300 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు రాజశేఖర్ వెల్లడించారు. ‘‘కొత్త ప్లాంటులో ఉత్పత్తి నవంబరు చివరి నాటికి 50 శాతం, డిసెంబరులో 100 శాతానికి చేరుకుంటుంది. డాక్టర్ కాపర్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. కంపెనీ తయారు చేస్తున్న ఇతర ఫుడ్ ప్రొడక్టులకు మంచి ఆదరణ లభిస్తోంది. నూతన మార్కెట్లలో విస్తరిస్తాం. కాపర్ ఉత్పత్తుల ద్వారానే నెలకు రూ.40 కోట్ల వరకు ఆదాయం ఆశిస్తున్నాం. కొత్త ఫ్యాక్టరీతో 400 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని వివరించారు. -
ఎమ్మెస్సార్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు: రేవంత్
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ప్రకటన, ఖర్చుపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కేసీఆర్ పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్పై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనను పొడిగిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్‌ను ఆ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ఎమ్మెస్సార్... కాంగ్రెస్ మనసులో మాటను బయటపెట్టారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే మురిగిపోయినట్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకురావాలంటే ఎన్డీయే అభ్యర్థిని గెలిపించాలన్నారు. -
'ఎమ్మెస్సార్ వృద్ధాప్యంలో ఉన్నారు'
హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో స్పందించారు. ఎమ్మెస్సార్ వ్యాఖ్యలను గుత్తా సుఖేందర్‌రెడ్డి తప్పపట్టారు. ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకున్నారని గుర్తు చేశారు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నారని చెప్పారు. అందువల్ల కేసీఆర్ పాలనపై ఆయనకు అవగాహన లేదన్నారు. ఈ వయస్సులో ఎమ్మెస్సార్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని గుత్తా అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందని మాజీ పీసీసీ చీఫ్ ఎమ్మెస్సార్ శుక్రవారం హైదరాబాద్ లో ప్రశంసించారు. కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు ఆరోపించినట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ పై విధంగా స్పందించారు. -
ఎంఎస్ఆర్ ఆదాయం జూమ్
సాక్షి, హైదరాబాద్: కన్సూమర్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఎంఎస్ఆర్ ఇండియా లిమిటెడ్ 2014-15 ఆర్ధిక సంవత్సరం వార్షికాదాయం 750 శాతం పెరిగింది. ఈ మేరకు కంపెనీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.85 కోట్ల ఆదాయంపై రూ.40.93 లక్షల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.10.18 కోట్లు కాగా, నికర నష్టం 15.33 లక్షలుందని వివరించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో రూ. 28.04 కోట్ల ఆదాయం నమోదు కాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.7.65 కోట్లు ఆదాయం నమోదైందన్నారు. దీంతో పోలిస్తే ఆదాయం 266 శాతం పెరిగినట్లయిందన్నారు. -
'కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేను'
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బాధించిందని మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి ఎం సత్యనారయణ రావు (ఎమ్మెస్సార్) అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి జీవీ నర్సింగరావు శత జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెస్సార్, పీసీసీ చీఫ్ పొన్నాల, ఎంపీ పాల్వాయి, నర్సారెడ్డితో పాటు జీవీ నర్సింగరావు కుమారుడు రూపేందర్ రావు పాల్గొన్నారు. జీవీ నర్సింగరావు సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలే అయింది. అప్పడే కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేనని అన్నారు. పారిశ్రామిక విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రూపేందర్ రావు స్పష్టం చేశారు. ఆ తర్వాతే స్పందిస్తానని ఆయన చెప్పారు. -
ఎమ్మెస్సార్ రాజీనామా
కరీంనగర్ : అనూహ్యంగా.. ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్లు రాజీనామా చేయాలని ఈనెల 3న గవర్నర్ కార్యాలయం ఆదేశించింది. ఈ క్రవుంలో ఎమ్మెస్సార్ మంగళవారం తన రాజీనావూ పత్రాన్ని గవర్నర్‌కు పంపించారు. 1990లో తొలిసారి ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులై న ఆయన 1994 వరకు పదవిలో ఉన్నారు. 2007 నవంబర్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన నుంచి ఇప్పటివరకు ఎమ్మెస్సార్ ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆరు సంవత్సరాల పాటు పదవిలో ఉండేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన సవరణలు కూడా ఆయన చేయించుకున్నారు. ఆర్టీసీపై తనకు మినహా ఇతరులకు ఆధిపత్యం ఉండరాదని అప్పటివరకు ఉన్న జోనల్ చైర్మన్ల వ్యవస్థను కూడా రద్దు చేయించారు. ఈ సంవత్సరంతో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే.. గవర్నర్ ఎమ్మెస్సార్ రాజీనామాను ప్రత్యేకంగా కోరలేదని, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో విమర్శలు రావద్దనే రాజీనావూ చేశారని ఆయన కుటుంబసభ్యులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఎమ్మెస్సార్‌కు పదవులు కొత్తేం కాదని, ఇంకా పదవీకాలం ఉన్నా రాజీనామా చేశారన్నారు. అదే బాటలో అడ్లూరి ఆర్టీసీ తరువాత రాష్ట్ర స్థారుులో పదవిలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కువూర్ కూడా రాజీనామా బాట పట్టనున్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవికి ఎమ్మెస్సార్ రాజీనామా చేయుడంతో ఆయనను అనివార్యంగా లక్ష్మణ్ అనుసరించాల్సి వస్తోంది. తన కార్యాలయూనికి ఆదేశాలు వచ్చిన మరుక్షణమే రాజీనావూ చేస్తానని లక్ష్మణ్‌కువూర్ ‘న్యూస్‌లైన్’కు స్పష్టం చేశారు. ఆయన కొద్ది నెలల క్రితమే ఈ పదవిలో నియమితులయ్యారు. మరికొందరు సైతం.. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ నిర్ణయుంతో జిల్లాలో నామినేటెడ్ పదవులు పొందిన నాయకులంతా తవు పదవులు త్యాగం చేయుక తప్పని పరిస్థితి ఎదురైంది. జిల్లాలో నామినేటెడ్ పోస్టుల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా పనకంటి చంద్రశేఖర్, ఆర్టీఏ సభ్యుడిగా ఆమ ఆనంద్ కొనసాగుతున్నారు. కరీంనగర్, జమ్మికుంట, హుస్నాబాద్, వుుస్తాబాద్, వేవుులవాడ, వుల్యాల, గంగాధర, జగిత్యాల, చొప్పదండి, కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్, ధర్మపురి, ధర్మారం, గొల్లపల్లి వూర్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు. గవర్నర్ నిర్ణయం పూర్తిగా అవులరుుతే వీరందరూ రాజీనామా చేయూల్సి ఉంటుంది. -
విభజన ప్రక్రియ ఆగదు.. రాష్ట్రం సిద్ధిస్తుంది