
ఎంఎస్‌ఆర్ ఆదాయం జూమ్
సాక్షి, హైదరాబాద్: కన్సూమర్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఎంఎస్‌ఆర్ ఇండియా లిమిటెడ్ 2014-15 ఆర్ధిక సంవత్సరం వార్షికాదాయం 750 శాతం పెరిగింది. ఈ మేరకు కంపెనీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.85 కోట్ల ఆదాయంపై రూ.40.93 లక్షల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.10.18 కోట్లు కాగా, నికర నష్టం 15.33 లక్షలుందని వివరించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో రూ. 28.04 కోట్ల ఆదాయం నమోదు కాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.7.65 కోట్లు ఆదాయం నమోదైందన్నారు. దీంతో పోలిస్తే ఆదాయం 266 శాతం పెరిగినట్లయిందన్నారు.