T Congress MP
-
లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా చేయండి!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. శనివారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్‌రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే.. మాత్రం 17 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
'ఎమ్మెస్సార్ వృద్ధాప్యంలో ఉన్నారు'
హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో స్పందించారు. ఎమ్మెస్సార్ వ్యాఖ్యలను గుత్తా సుఖేందర్‌రెడ్డి తప్పపట్టారు. ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకున్నారని గుర్తు చేశారు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నారని చెప్పారు. అందువల్ల కేసీఆర్ పాలనపై ఆయనకు అవగాహన లేదన్నారు. ఈ వయస్సులో ఎమ్మెస్సార్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని గుత్తా అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందని మాజీ పీసీసీ చీఫ్ ఎమ్మెస్సార్ శుక్రవారం హైదరాబాద్ లో ప్రశంసించారు. కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు ఆరోపించినట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ పై విధంగా స్పందించారు. -
భయంతోనే కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై నిర్ణయం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సభ పెడితే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడ్డారని ఆ పార్టీ ఎంపీ వీహెచ్ ఆరోపించారు. అందుకే ఉద్యోగ భర్తీపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆదివారం గాంధీభవన్‌లో వీహెచ్ మాట్లాడుతూ... ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చాలని కేసీఆర్‌ను వీహెచ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను నమ్మి నిరుద్యోగ యువత టీఆర్ఎస్కు అధికారం ఇచ్చిందన్నారు. నిరుద్యోగ విద్యార్థులకు చేసే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వీహెచ్ భరోసా ఇచ్చారు. -
'ఇద్దరు సీఎంలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పాలనతో తెలుగు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో పాల్వాయి మాట్లాడుతూ... ఈ రెండు రాష్ట్రాలలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా... ఇద్దరు సీఎంలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పుష్కరాలను ప్రచార ఆర్భాటం కోసమే ఇద్దరు సీఎంలు పని చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగంగాకాదని ఇరిగేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని పాల్వాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. అలాగే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ ఆమోదనీయంకాదని కూడా కమిటీ చెప్పిందన్నారు. అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరడం ప్రజలను మభ్యపెట్టడమే అని కేసీఆర్‌పై పాల్వాయి మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న మేరకే ప్రాణహిత - చేవెళ్ల కట్టాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. సీడబ్ల్యూసీ ఒప్పుకున్నా ఇచ్చంపల్లి పాజెక్టును ఎందుకు చేపట్టడంలేదన్న కేంద్రం ప్రశ్నకు కేసీఆర్ సర్కార్ స్పందించడం లేదన్నారు. -
'అనవసరమైన వారిని పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరమైన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆరోపించారు. పదవులనుభవించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ పార్టీలో మరో బీసీ నేతను తయారు చేయలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుల ఫొటోలు గాంధీభవన్‌లో ఉండటానికి అనుమతి లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ అవినీతి, ఓటుకు కోట్లు అంశాలపై ప్రజల్లోకి వెళ్తామని వీహెచ్ స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి 20 వరకు జిల్లాల్లో ధర్నా నిర్వహించాలని పీసీసీని కోరినట్లు వీహెచ్ తెలిపారు. అంతకుముందు గాంధీభవన్ మీడియా హాల్ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్, కేకే, బొత్స సత్యనారాయణ ఫొటోలను వీహెచ్, మాజీ మంత్రి ఆర్ దామోదరరెడ్డి తొలగించారు. -
'మోదీ..ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోరు'
హైదరాబాద్: నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించిన ఏపీ సీఎం చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో వీహెచ్ మాట్లాడారు. తప్పు చేసిన చంద్రబాబు అరెస్ట్ కావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పు చేయలేదనుకుంటే సీబీఐ విచారణకు సిద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు పాల్పడటం పెద్ద నేరం అని వీహెచ్ అభివర్ణించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చంద్రబాబుకు బ్లాక్ మనీ ఎలా వచ్చిందో తెలియాలన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదని వీహెచ్ తెలిపారు. సీమాంధ్రులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని వీహెచ్ ఆరోపించారు. దేశంలో నల్లధనం లేకుండా చేస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ... తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు వ్యవహారంలో ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోవడం లేదని వీహెచ్ సందేహం వ్యక్తం చేశారు. -
'రేవంత్ దొరికిన దొంగ'
హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ పై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌లకు లేఖ రాస్తున్నట్లు వీహెచ్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అని ఆయన అభివర్ణించారు. అవినీతి వ్యతిరేక సమాజాన్ని నిర్మిస్తానంటూ చంద్రబాబు ఇటీవల విజయవాడలో నవ నిర్మాణ దీక్షలో ప్రకటించారు. అవినీతిని ఎలా నిర్మూలిస్తారో చెప్పాలనీ బాబును వీహెచ్ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించారని... ఆ విషయం కూడ తెలవలసి ఉందని వీహెచ్ అన్నారు.