భయంతోనే కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై నిర్ణయం | VH takes on KCR | Sakshi
Sakshi News home page

భయంతోనే కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై నిర్ణయం

Published Sun, Jul 26 2015 1:30 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

VH takes on KCR

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సభ పెడితే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడ్డారని ఆ పార్టీ ఎంపీ వీహెచ్ ఆరోపించారు. అందుకే ఉద్యోగ భర్తీపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆదివారం గాంధీభవన్లో వీహెచ్ మాట్లాడుతూ... ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఆ హామీని నెరవేర్చాలని కేసీఆర్ను వీహెచ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ను నమ్మి నిరుద్యోగ యువత టీఆర్ఎస్కు అధికారం ఇచ్చిందన్నారు. నిరుద్యోగ విద్యార్థులకు చేసే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వీహెచ్ భరోసా ఇచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement