సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే వారిద్దరూ నా పంచ గురించి మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డికి భటి కౌంటర్ ఇచ్చారు. వీరి ఆస్తులు వేల కోట్లకు ఎలా చేరుకున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, కనగల్లులో భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భవిష్యత్తే లేకుండా పోయింది. ధరణి పేరుతో భూమి గుంజుకుంటున్నారు. గిరిజన పోడు భూములను లాక్కుంటున్నారు. ఉద్యోగాలు వస్తామని ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడా ఇల్లు లేదు.. వాకిలి లేదు. ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వడం లేదు.
ఉపాధి పనులు చేసుకునేవాళ్లకు కూలీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో నేడు భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లాలోని దాదాపు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించారు. సొరంగం తవ్వేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకువచ్చాం. టన్నెల్‌కు సంబంధించిన దాదాపు 32 కిలోమీటర్ల పనులను పూర్తి చేశాం.
రాష్ట్రం వచ్చి పదేళ్లువుతోంది.. ఇన్నేళ్లలో పట్టుమని రెండు మూడు కిలోమటర్లు కూడా తవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడమంటే నా పంచ గురించి, నా గోశి గురించి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎక్కడా మార్పు రాలేదు. బీఆర్ఎస్ నాయకుల జీవితాల్లో మాత్రం అద్భుతమైన మార్పు వచ్చింది. సీఎం కేసీఆర్, జగదీష్ రెడ్డి కుటుంబం, గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ ఆస్తులు వేల కోట్లు పెరిగాయి. వీరిద్దరి లాంటి వాళ్లతో నల్లగొండ జిల్లా ప్రజలకు ఏలాంటి ప్రయోజనం ఉండదు అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. కార్యకర్తల నారాజ్!
Comments
Please login to add a commentAdd a comment