( ఫైల్ ఫోటో )
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్ పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంందనే ప్రచారం సాగుతోంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంతో సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై కూడా వ్యాఖ్యలు చేశారు.
కాగా, గుత్తా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు, మంత్రి జగదీష్‌కి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. అలాగే, ఉద్యోగుల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల్లో నేను జోక్యం చేసుకోలేదన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. తన కుమారుడు అమిత్‌కు టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తారు. టికెట్ కోసం పైరవీలు చేయనని చెప్పారు.
వామపక్షాలతో సీట్లు పొత్తు ఖరారు అయ్యాకనే ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మార్పు క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. వామపక్షాలు బీఆర్ఎస్‌తో పొత్తుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఎక్కడ పని చేసినా రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలన్నారు. కాగా, సొంత పార్టీ ఎంపీపీ, మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం సరికాదు. అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సీరియస్ అయ్యారు. వెంకట్ రెడ్డి నోటికి అడ్డు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. తాను భాష ప్రయోగం విషయంలో హుందాగా ఉంటుందని తెలిపారు. బురదలో రాయి వేసే అలవాటు తనకు లేదన్నారు. తమ పనిని ప్రజలు మెచ్చుతున్నారా.. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించాలని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు!
Comments
Please login to add a commentAdd a comment