కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే పార్టీకి నష్టమని అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి సోదరులు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి ఐదు సార్లు ముహుర్తాలు పెట్టుకున్నారని చెప్పారు.
పాలమూరు, రంగారెడ్డి కాంట్రాక్టులను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు అండంతో సంపాదించారని ఆరోపించారు. వీరంతా ఎంత తొందరగా కాంగ్రెస్ పార్టీని వీడితే అంత మంచిదని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటున్నాని ఎంపీ పాల్వాయి తెలిపారు.