సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగించే పరిస్థితి లేదు. డిసెంబర్‌లోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జమిలీ ఎన్నికల పేరుతో ప్రజలను గందరగోళంలో పడేశారు. అన్ని మార్గాలను ఉపయోగించి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. జమిలీ ఎన్నికలు సాధ్యం కాకపోతే మినీ జమిలీ నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలను గందరగోళపరిచి గట్టెక్కాలని బీజేపీ చూస్తోందన్నారు.
అలాగే, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహులు ఉన్నారని కొందరు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలకు స్వప్రయోజనాలే ముఖ్యం. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి.. వీరి ముగ్గురివి మూడు దారులు. కోమటిరెడ్డి సగం శరీరం బీజేపీలోనే ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే.
Comments
Please login to add a commentAdd a comment