
'కేసీఆర్, చంద్రబాబు ముఠా నేతల్లా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ... ఇద్దరు సీఎంలు గ్యాంగ్వార్ మాదిరిగా... ముఠా నేతలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వ్యక్తిగత కక్షలు తీర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారం వివాదం రెండు రాష్ట్రాల మధ్య హోరుగా మార్చేశారన్నారు. అధికారం చేతిలో ఉందికదా అని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.