'అది ట్యాపింగ్ కాదు.. వాయిస్ మాత్రం బాబుదే' | that is not phone taping.. but that is chandrababu voice: gutta sukender | Sakshi

'అది ట్యాపింగ్ కాదు.. వాయిస్ మాత్రం బాబుదే'

Published Fri, Jun 12 2015 1:23 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'అది ట్యాపింగ్ కాదు.. వాయిస్ మాత్రం బాబుదే' - Sakshi

'అది ట్యాపింగ్ కాదు.. వాయిస్ మాత్రం బాబుదే'

ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడిన ఆడియో టేపులు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేసినవి కావని, అయితే స్టీఫెన్ సన్తో ఉన్న ఫోన్ సంభాషణలోని వాయిస్ మాత్రం చంద్రబాబునాయుడిదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడిన ఆడియో టేపులు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేసినవి కావని, అయితే స్టీఫెన్ సన్తో ఉన్న ఫోన్ సంభాషణలోని వాయిస్ మాత్రం చంద్రబాబునాయుడిదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇంకా మరిన్ని తప్పులు చేయోద్దని సూచించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, కేసీఆర్ ఫిరాయింపులతో అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వ్యక్తిగత ప్రతిష్ఠ ఆదిపత్యం కోసం రెండు రాష్ట్రాల మధ్య అగాధం సృష్టిస్తున్నారని చెప్పారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని అన్నారు. కేసీఆర్ వాటిని త్వరగా పూర్తి చేయాలని, వాటికి ఏపీ మంత్రులు అడ్డుపడాలని చూడటం సరికాదని అన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో రూపొందినవేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై తుదిదశకు చేరిన ప్రాజెక్టులను కేసీఆర్ త్వరగా పూర్తి చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement