
`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు`
నల్గొండ: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ఎంపీలపై చర్యలు తీసుకోవాడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలిసే వారంతా సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారని సుఖేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో రేపు రాష్ట్రపతిని కలుస్తామని ఎంపీ గుత్తా సుఖేందర్ తెలిపారు.