సాక్షి, న్యూఢిల్లీ/ సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వినతికి స్పందిస్తూ స్టేషన్ పనులను మంత్రి వెంకయ్య సమీక్షించారు. ట్రాన్స్‌మీటర్ భవనం ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. ఎఫ్‌ఎం స్టేషన్ ఏర్పాటుకు 2007లోనే కేంద్రం ఆమోదం తెలిపినప్పటికీ పనుల్లో పురోగతి లేదు.
గుత్తా వినతికి స్పందన..: సూర్యపేట ఎఫ్‌ఎం స్టేషన్ పూర్తయ్యేందుకు సమయం ఆసన్నమైంది. బుధవారం దీనిపై పార్లమెంటులో నల్ల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి వెంకయ్య నాయుడుకు వినతిపత్రం సమర్పించడంతో ఆయన సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడారు. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఈ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను మంజూరు చేశారు. నిర్మాణ పనులు కొంత పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావులు వెంకయ్య నాయుడును కోరినట్లు తెలిసింది.
సూర్యాపేట ఎఫ్‌ఎం స్టేషన్ నిర్మాణం పూర్తిచేయండి
Published Thu, Jul 21 2016 2:50 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
Advertisement
Advertisement