సమర వీర్ క్రియేషన్స్ పతాకంపై గూడూర్ నారాయణరెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రజాకర్'. యధా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఇందులో బాబీ సింహా, వేదిక జంటగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర తమిళ వర్షన్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర నిర్మాత గూడూర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమర్ వీర్ క్రియేషన్స్ సంస్థ తరపున యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
స్వాతంత్య్ర పోరాటం కాలంలో హైదరాబాదులో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రమని చెప్పారు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనం కాకముందు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంపై రూపొందించిట్లు చెప్పారు. నిజాం రాజు హైదరాబాదును దుర్గిస్తాన్‌గా మార్చే ప్రయత్నం చేసినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు. తమ వంశంలో తన తాత కూడా ఆ పోరాటంలో పాల్గొని ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి ఒక యదార్థ ఘటనపై ఈ తరం ప్రజలకు తెలియచేయాలనే ప్రయత్నమే ఈ రజాకర్ చిత్రమని చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్రం నిర్మాత నారాయణరెడ్డి తాత పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారన్నారు. మరుగున పడ్డ చరిత్ర ప్రజలకు తెలియచేయాలనే లక్ష్యంతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించడం గర్వకారణమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment