
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి గూడూరు నారాయణరెడ్డి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఆయనతో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుజ్జిగించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్, బీజేపీలు హోరాహోరిగా తలపడున్నాయి. వారి మాటల యుద్ధం సాగుతుండగా, ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ వెనుకబడింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్.. గ్రేటర్ వార్‌లో కూడా వెనకబడిపోవడంతో ఆ నేతల్లో నైరాశ్యం ఆవహించింది. (చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేము..)