
టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల పాటు సాగిన కేసీఆర్ అరాచక పాలనకు అంతం తప్పదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ ఆరోగ్యశ్రీని పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వాల్లోని సమస్యలపై సమీక్షించే అధికారం ఉన్నా గవర్నర్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.
గవర్నర్ గుడికి కాకుండా ఆసుపత్రులకు వెళితే ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తానన్న కేసీఆర్.. ఖల్లాస్ చేశారని విమర్శించారు. ప్రజలను వంచించడంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడని అభివర్ణించారు.