వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు నారాయణరెడ్డి మృతి | YSRCP Senior leader narayana reddy died | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు నారాయణరెడ్డి మృతి

Published Wed, Oct 28 2015 2:08 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

రాష్ట్ర ఖాదీ పరిశ్రమల బోర్డు మాజీ డెరైక్టర్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దొంతిరెడ్డి నారాయణరెడ్డి(65) అనారోగ్యంతో బాధపడుతూ.. బుధవారం కన్నుమూశారు.

వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర ఖాదీ పరిశ్రమల బోర్డు మాజీ డెరైక్టర్, వైఎస్‌ఆర్ సీపీ సీనియర్ నాయకుడు దొంతిరెడ్డి నారాయణరెడ్డి(65) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడుకు చెందిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. నారాయణరెడ్డి...మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సన్నిహితుడిగా మెలిగేవారు. నారాయణరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement